Posts

మకర సంక్రాంతి ఒకనాడు బౌద్ధ పండుగ

మకర సంక్రాంతి - బౌద్ధ పండుగ  మకర సంక్రాంతి అంటే బుద్ధుని జ్ఞానోదయానికి సంబంధించిన వేడుక. ఉత్తరాయణం మరియు దక్షిణాయనం సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన మార్గాలు.  గాంధార బౌద్ధమతంలో "మారా ప్రపంచం"గా భావించే దక్షిణాయణంలో సూర్యుడు దిగివస్తాడు.  దీనికి విరుద్ధంగా, ఉత్తరాయణం అంటే ఆకాశంలోకి పైకి లేవడం, ఇది "బుద్ధుని ప్రపంచం" అని అర్థం.  ఉత్తరాయణంలోకి ప్రవేశించడం అంటే స్థూపం లాంటి బౌద్ధ ఆకాశంలోకి ప్రవేశించడమే.  సూర్యుడు మకర రాశి నుండి బయటకు వచ్చిన తర్వాత బుద్ధుని ఆకాశంలో ఉత్తరాయణాన్ని ప్రారంభిస్తాడు, అందుకే బౌద్ధమతంలో మకర రాశిని "బుద్ధుని ప్రవేశం"గా పరిగణిస్తారు మరియు అందువల్ల బౌద్ధ స్థూపాల ప్రవేశద్వారం వద్ద మకర చిహ్నం చెక్కబడింది.  సాంచి స్థూపం ప్రవేశ ద్వారం వద్ద ఇలాంటి "మకర ప్రవేశం" ఉంది. సాంచి స్థూపం ప్రవేశ ద్వారం వద్ద "మకర తోరన్" ఉంది.  మకరం "త్రిరత్న" యొక్క చిహ్నం మరియు పరివర్తన అంటే ప్రవేశించడం.  మకర పరివర్తన అంటే ఆరాధన మరియు బోధిని పొందడం కోసం స్తూపంలోకి ప్రవేశించడం.  మకరరాశి పక్కన బుద్దుడు మేషరాశి.  కావున గాంధార శిల్పాలలో బోధిసత్వ...

బుద్దుడి విధానాల బ్రాహ్మణీకమే శివుడి రూపం

*బుద్దుడి విధానాల బ్రాహ్మణీకమే శివుడి రూపం*   యురేషియన్‌ బ్రాహ్మణులు బుద్దుడి విదానాలకు శివుడి రూపం కల్పించి బ్రాహ్మణీకరించారు. బౌద్ద మతాన్ని పోషించిన రాజులను శివుని భక్తులుగా రాక్షసులుగా చిత్రీకరించి ఎక్కడ కూడా బౌద్దమనే పేరు ఎత్తకుండా తమ రచనల్లో జాగ్రత్త పడి బౌద్దాన్ని నిర్వీర్యం చేయడంలో సఫలమయ్యారు. శివుడి రూపానికి సంకేతాలు *త్రిశూలం -బుద్దుడి త్రీపీటకాలగు సుత్త పీటకం, వినయ పీటకం, అభిదర్మ పీటకం.* *మూడోకన్ను - బుద్దుడి మద్యేమార్గం.* *ఢమరుకం - సమాజాన్ని మోల్కొలిపే విద్య.* *నంది-బౌద్దమతాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారిలో నంద వంశరాజులగు నవనందులు ముఖ్యులు వారి పేర్లు (మహాపద్మనంద, పాదుకనంద, పానుగుపతినంద, భూతపాలనంద, రాష్ట్రపాలనంద, గోవిశనకనంద, దశశీదకనంద, కైవర్దనంద, మహేంధ్రనంద)* *గంగా - శాక్యులకు కొలియులకు మద్య వచ్చిన నీటి తగాదాని బుద్దుడు పరిష్కరించి జ్ఞానాన్వేషణ కొరకు పాటలిపుత్రకు ప్రయాణమవుతాడు అది ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టం.* *బిక్షపాత్ర - బుద్దుడు అతని శిశ్యులు ప్రజలను జ్ఞానవంతులుగా చైతన్యం చేయడంలో బాగంగా ఇల్లిలు తిరుగుతూ బిక్షాటన చేసేవారు.* *అర్దనారీశ్వర రూపం -బుద్దుడు సంఘాన్ని స్థాపించ...

Buddha potrait

Buddha never had any thought of creating a new religion. He even strongly discouraged his portrait to be preserved for future generations. Even Mauryan Ashoka did not know the portait of buddha. After nearly 550 yrs after Buddha, samrat Kanishka(78ce) ordered Buddha scholars to create portrait of Buddha .  In Madhura archeology ,where ever you dig you will find Buddhist artifacts , not a single artifact of krishna vasudeva was found in Madhura.

బౌద్ధం - వాస్తవాలు

  బుద్ధుని గురించి, బౌద్ధం గురించి  అవగాహన కోసం ఈ క్రింది వాస్తవాలను  గమనించగలరు: ★బుద్ధుడు పుట్టేనాటికి (క్రీస్తు పూర్వం 563 సంవత్సరం నాటికి) భరత ఖండం లోనే కాదు అప్పటి ప్రాచీన నాగరికతలైన ఇండియాతో సహా, చైనా, ఈజిప్టు, మెసపటోమియా లలో ఎక్కడా కూడా 'హిందూ మతం' అనేది లేనే లేదు. 【శ్రుతులలో (వేదాలలో), స్మ్రుతులలో (ధర్మశాస్త్రాలు), ఇతిహాసాలు, పురాణాలలో ఎక్కడా హిందూ అనే శబ్దం కనిపించదు】. ★భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా జయించిన విదేశీ రాజులు - పర్షియన్ (ఇరాన్) రాజులు అయిన 'సైరస్' మరయూ అతని మనుమడు 'డేరియస్' (6౦౦ B.C.). ★అప్పటి భరత ఖండం లో 'షోడస మహాజనపదములు' అనే16 రాజ్యాలు మాత్రమే (అంగ మహాజనపదం లేదా రాజ్యం, వజ్జి లేదా లిచ్ఛవి రాజ్యము, కోసల రాజ్యము, మల్ల రాజ్యము, etc.,) ఉనికిలో ఉన్నాయి. వాటిలో ఈ పర్షియన్లు జయించింది వాయవ్య భారతం - సింధు ప్రాంతంలోని 'కాంబోజ' (ఇది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది), మరియూ 'గాంధార' (ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లోని కాందార ప్రాంతం) రాజ్యాలను జయించారు(బింబిసారుని కాలంలో). వీరు ఈ ప్రాంతాన్ని (సింధు) క్రీ.పూ. 600 నుండి 334 ...

బుద్ధుడు కనుగొన్న విశ్వ మహాసత్యాలు

*త్రిరత్నాలు అనబడే మూడు విశ్వ మహాసత్యాలు.* *త్రిరత్నాలనగా అనిత్యం, అనాత్మం, దుక్ఖం - దుక్ఖ నిరోధం అని పిలువబడే మూడు విశ్వసత్యాలు. ఈ విశ్వం అంతా యీ మూడింటితో నిండి వున్నది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.* *బుద్ధభగవానులవారు మానవాళికి అందించిన "అనిత్యం" అనే విశ్వసత్యం ప్రకారం, యీ విశ్వంలో శాశ్వతంగా వుండేది ఏదీ లేదు. ప్రతీదీ నిరంతరం మార్పు చెందుతూనే వుంటుంది. ఏదీ నిలకడగా వుండదు. ఇదే అనిత్య మహాసత్యం.* *విశ్వానికి సంబంధించి ఎప్పటికీ తిరుగులేని సత్యం యిది. ఈ అనిత్య సత్యాన్ని బాగా ఎరుక పరుచుకోవడానికీ, అనుభూతం చేసుకోవడానికీ 'కాలం' బాగా ఉపయోగ పడుతుంది. పరిశీలిస్తూ వుంటే గాలి, నీరు, అగ్ని, మట్టి, ఆకాశం అనే మహా ఖాళీ ప్రదేశం.. వీటితో నిండిన జీవులు, నిర్జీవులతో సహా సర్వ ప్రపంచం అంతా నిముష నిముషానికీ ఏదో ఒక మార్పుతో, కదలికలతో, ధ్వనులతో, చైతన్యంతో, మార్పులతో కనిపిస్తుంది. అనుభూతమవుతుంది. మనలోనూ, మన ఎదురుగానూ ప్రతిక్షణం పుడుతూ మారిపోతూ నశించి పోతున్న భావనలు, దృశ్యాలు, శబ్దాలు, వెలుగులు, గాలులు ఒకదాని తరువాత ఒకటి నిరంతరంగా, అప్రతిహతంగా జరిగిపోతూ వుంటాయి. కేవలం భౌతికదృష్టితోనే సాధకు...

ద్వేషం దేనికీ పరిష్కారం కాదు.

ద్వేషం దేనికీ పరిష్కారం కాదు. బుద్ధుడు తన కాలంలోని బ్రాహ్మణులలోని 'బ్రాహ్మణులు ఎక్కువ వారు, తక్కిన వారు తక్కువ వారు, జ్ఞానాన్ని, ముక్తిని పొందటానికి బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉంది' అనే ఆధిక్యతాభావాన్ని తిరస్కరించాడు. మానవ సమానత్వాన్ని ప్రకటించాడు. అంతేగాని ఎవ్వరినీ ద్వేషించలేదు. వేదాలను చదవటంవల్ల, చదివించటం వలన, యజ్ఞ యాగాలవలన దుఃఖవిముక్తి కలుగదని, రాగ, ద్వేష, మోహాలను వదలటం వల్లనే అది సాధ్యమౌతుందని అన్నాడు. బ్రాహ్మణ పదాన్ని బుద్ధుడు జ్ఞానికి పర్యాయంగా ఉపయోగించాడు. పుట్టుక తో ఎవడూ బ్రాహ్మణుడు కాడని చెప్పాడు. వర్ణాశ్రమ ధర్మాలను తిరస్కరించాడు. అతడు జ్ఞానవాది. ఆయన మాటల్లోని సత్యాన్ని గుర్తించిన ఎందరో బ్రాహ్మణులు ఆయన శిష్యులైనారు. తర్వాత అశోకుని కాలం నుండి బౌద్ధానికి ప్రాధాన్యం లభించటం వలన వైదికం వెనకబడి పోయింది. దానిని సహించలేని బ్రాహ్మణులు చివరి మౌర్యరాజును చంపి రాజ్యాన్ని చేజిక్కించుకొన్నారు. అప్పటి నుండి బౌద్ధాన్ని అణిచివేయటం మొదలై ముస్లింల దండయాత్రల అది అనేక విధాలుగా సాగింది. అందులో భాగమే బుద్ధున్ని దశావతారాలలో చేర్చటం. మనుస్మృతిని రాసి శూద్రులను అంటరాని వారిగా, జంతువుల కన్న హీ...

అంబేద్కర్ చెప్పిన సూక్తులు

అంబేద్కర్ చెప్పిన సూక్తులు ◆ People who have not decided their objective they can't get any sucess. When they dont get any success, they can't make any impact in the history of the time.  ◆ ఏ ప్రజలైతే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోరో వారు ఎటువంటి విజయాన్ని పొందలేరు ఎపుడైతే వారు విజయాన్ని పొందలేరో, వారు చరిత్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేరు.                 ◆ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు. ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం. ◆ నా దేశ సమస్యలకు-నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణలు వస్తే ముందు నా జాతి కి ప్రాముఖ్యత ఇస్తాను.కానీ నేను - నా దేశం ఈ రెండింటిలో నా దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాను. ◆దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.ప్రతిపౌరుని నైతికాభివృద్దే దేశాభివృద్ధి. ◆జీవించేందుకు తినాలి.సమాజ సంక్షేమానికై జీవించాలి. ◆నీ కోసం జీవిస్తే.. నీ లోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే... జనం లో నిలిచి పోతావు. ◆ఓటుహక్కు ద్వారా పోరాడి రాజులు అవుతారో, అమ్ముడు పోయి బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ◆ కులం పునాదుల మీద ఒక జాతిని ...