బుద్దుడి విధానాల బ్రాహ్మణీకమే శివుడి రూపం
*బుద్దుడి విధానాల బ్రాహ్మణీకమే శివుడి రూపం*
యురేషియన్ బ్రాహ్మణులు బుద్దుడి విదానాలకు శివుడి రూపం కల్పించి బ్రాహ్మణీకరించారు. బౌద్ద మతాన్ని పోషించిన రాజులను శివుని భక్తులుగా రాక్షసులుగా చిత్రీకరించి ఎక్కడ కూడా బౌద్దమనే పేరు ఎత్తకుండా తమ రచనల్లో జాగ్రత్త పడి బౌద్దాన్ని నిర్వీర్యం చేయడంలో సఫలమయ్యారు.
శివుడి రూపానికి సంకేతాలు
*త్రిశూలం -బుద్దుడి త్రీపీటకాలగు సుత్త పీటకం, వినయ పీటకం, అభిదర్మ పీటకం.*
*మూడోకన్ను - బుద్దుడి మద్యేమార్గం.*
*ఢమరుకం - సమాజాన్ని మోల్కొలిపే విద్య.*
*నంది-బౌద్దమతాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారిలో నంద వంశరాజులగు నవనందులు ముఖ్యులు వారి పేర్లు (మహాపద్మనంద, పాదుకనంద, పానుగుపతినంద, భూతపాలనంద, రాష్ట్రపాలనంద, గోవిశనకనంద, దశశీదకనంద, కైవర్దనంద, మహేంధ్రనంద)*
*గంగా - శాక్యులకు కొలియులకు మద్య వచ్చిన నీటి తగాదాని బుద్దుడు పరిష్కరించి జ్ఞానాన్వేషణ కొరకు పాటలిపుత్రకు ప్రయాణమవుతాడు అది ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టం.*
*బిక్షపాత్ర - బుద్దుడు అతని శిశ్యులు ప్రజలను జ్ఞానవంతులుగా చైతన్యం చేయడంలో బాగంగా ఇల్లిలు తిరుగుతూ బిక్షాటన చేసేవారు.*
*అర్దనారీశ్వర రూపం -బుద్దుడు సంఘాన్ని స్థాపించి
ఆ సంఘం లో స్త్రీలను అనుమతించారు. ఇది సంఘం స్త్రీ పురుషులతో చెరి సగం ఉన్నదని చెప్పడం.
*బుద్దుడు కపిలవస్తు నగరంలో వున్నప్పుడు బుద్దుని పినతల్లైన మహా ప్రజాపతి స్వయంగా ఆయన వద్దకు వచ్చి స్త్రీలను కూడా సంఘంలో చేర్చుకోమని అడుగుతుంది. సమాజంలో తమతమ కుటుంబాలలో నిరాదరణకు గురైన ఎంతోమంది స్త్రీలకు బుద్దిజం గౌరవప్రదమైన స్దానం కల్పించింది..* *సుమంగళ, ఇషిదాసి, బద్ద కుండలకేశ, మాతిక, వాసంతి, సుమేత, ఉత్పలవర్ణ మొదలైన వాళ్ళంతా సంఘంలోపలా బయటా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు.*
*సమాజం చేత నీచంగా చూడబడిన ఎందరో వేశ్యలు కూడా సంఘంలో చేరి గౌరవప్రదమైన స్దానాన్ని అందుకున్నారు కాశీకి చెందిన అర్థకాశి, ఉజ్జయనికి చెందిన పద్మావతి, వైశాలికి చెందిన అంబపాలి (ఆమ్రపాలి) ఇలా ఎంతో మంది బిక్షుణీలు ఆకాలంలో సంఘానికి నాయకత్వం వహించారు..*
*నాగుపాము-మూల వాసులైన నాగజాతిని పూర్తిగా ద్వంసం చేసే కుట్రలో జనమేజెయుడు బ్రాహ్మణులతో కలిసి సర్పయాగం చేశాడు..*
*అణచివేతను సూచించేవిదంగా విష్ణమూర్తి పామును పాన్పుగా, పాము పడగపై కృష్ణుడు నాట్యం చేసే కథలను బ్రాహ్మణులు అల్లుకున్నరు.. బుద్దుడు నాగజాతిని చేరదీసి సమాజంలో అస్పృశ్యత ఉండకూడదని చాటిచెప్పిండు..*
*చంద్రుడు - యాదృచికంగానే బుద్దుడి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలన్ని పౌర్ణమినాడే జరిగాయి. ఆయన జననం, జ్ఞానోదయం, దమ్మచక్ర ప్రవర్తనం, మహాభినిష్క్రమణం, మహ పరినిర్యాణం పౌర్ణమి రోజే జరిగాయి..*
బుద్దిస్టులైన మూలవాస "రాజులు" రావణ, నరాశూర, హిరణ్యకష్య మొదలగు రాజులను రాక్షసులుగా చిత్రించారు..
ఇప్పటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక్కప్పటి బౌద్దారామాలే, పంచారామాలు ఒకప్పటి బౌద్ధారామాలే. గయలో బ్రాహ్మణులు శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పటికీ మహాయాన బౌద్దం వల్ల ఆస్థలంలో బ్రాహ్మణ పాచికలు పారలేదు. బుద్దగయలో బుద్దుడి విగ్రహం ప్రక్కనే శివలింగం ఇప్పటికీ కన్పిస్తుంది..
"సత్యమేవ జయతే"
Comments
Post a Comment