బౌద్ధం - వాస్తవాలు


 
బుద్ధుని గురించి, బౌద్ధం గురించి  అవగాహన కోసం ఈ క్రింది వాస్తవాలను  గమనించగలరు:

★బుద్ధుడు పుట్టేనాటికి (క్రీస్తు పూర్వం 563 సంవత్సరం నాటికి) భరత ఖండం లోనే కాదు అప్పటి ప్రాచీన నాగరికతలైన ఇండియాతో సహా, చైనా, ఈజిప్టు, మెసపటోమియా లలో ఎక్కడా కూడా 'హిందూ మతం' అనేది లేనే లేదు. 【శ్రుతులలో (వేదాలలో), స్మ్రుతులలో (ధర్మశాస్త్రాలు), ఇతిహాసాలు, పురాణాలలో ఎక్కడా హిందూ అనే శబ్దం కనిపించదు】.

★భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా జయించిన విదేశీ రాజులు - పర్షియన్ (ఇరాన్) రాజులు అయిన 'సైరస్' మరయూ అతని మనుమడు 'డేరియస్' (6౦౦ B.C.). ★అప్పటి భరత ఖండం లో 'షోడస మహాజనపదములు' అనే16 రాజ్యాలు మాత్రమే (అంగ మహాజనపదం లేదా రాజ్యం, వజ్జి లేదా లిచ్ఛవి రాజ్యము, కోసల రాజ్యము, మల్ల రాజ్యము, etc.,) ఉనికిలో ఉన్నాయి. వాటిలో ఈ పర్షియన్లు జయించింది వాయవ్య భారతం - సింధు ప్రాంతంలోని 'కాంబోజ' (ఇది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది), మరియూ 'గాంధార' (ఇది ప్రస్తుతం పాకిస్తాన్ లోని కాందార ప్రాంతం) రాజ్యాలను జయించారు(బింబిసారుని కాలంలో). వీరు ఈ ప్రాంతాన్ని (సింధు) క్రీ.పూ. 600 నుండి 334 వరకూ పరిపాలించారు. ఈ పర్షియన్లే 'సింధు' ప్రాంతాన్ని 'హిందు' అని, మన దేశాన్ని 'హిందుస్థాన్' అని పిలిచేవారు.【వారికి 'స' పలకదని నేనను. వాళ్ళు 'స' ని 'హ' అని ఎందుకు పలికేవారో నాకు తెలీదు. కానీ పార్శీ, ఉర్దూ, అరబిక్ నిఘంటువుల ప్రకారం 'హిందూ' అంటే దొంగ, బానిస, లుచ్ఛా, నల్లని వాడు లాంటి అర్ధాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాళ్ళలా ఎందుకన్నారో అనే విషయం పక్కనపెడితే, వాళ్ళు ఒక ప్రాంత (సింధు) ప్రజలని అలా పిలిచారనే విషయం మనం గుర్తించాలి 】

★కాబట్టి చారిత్రకంగా చూస్తే 'హిందూ' అనే శబ్దం 'ప్రాంతం' పేరే తప్ప మతం పేరు కాదు. అలాగే హిందుత్వం అనేది కూడా బుద్ధుని తదనంతరమే రూపుదాల్చిందని స్పష్టమవుతోంది. మరి బుద్ధుడు హిందువు ఎలా అవుతాడు?

★పోతే గౌతముడి తండ్రి "శుద్ధోదనుడు". ఇతను 'శాక్య' తెగకు చెందినవాడు. ఈ శాక్య తెగ 'రోహిణీ నది' ఒడ్డున ఉండేది. నదికి అవతలివైపున 'కొలియ' తెగ రాజ్యం ఉండేది. (షోడస మహా జనపదాలైన 16 రాజ్యాలే కాక అప్పట్లో చిన్న జనపదాలు, గణాలు చాలానే ఉన్నాయి. ఒక్కో రాజ్యం ఒక్కో గణ నాయకుడు లేదా రాజు పాలనలో ఉండేవి. అలాంటివే ఈ రెండు తెగలు/గణాలు/ రాజ్యాలైన శాక్య మరియూ కొలియ).

★రోహిణీ నదీ జలాల విషయమై శాక్యులకూ, కొలియులకూ మధ్య జరగబోయే యుద్ధాలను వ్యతిరేకించినందుకు గాను 'సంఘ' నిర్ణయానుసారం గౌతముడు దేశాన్ని వదిలిపోతాడు. బుద్ధుడు దేశాన్ని వదిలిపెట్టడానికి కారణం ఆనాటి తెగల మధ్య ఘర్షణేనని 'కోశాంబి, అంబేడ్కర్ లు' ఇద్దరూ అభిప్రాయపడ్డారు.

★ఇక బుద్ధుడు క్షత్రియుడో కాదో నాకు తెలీదు. అతను శాక్య తెగకు చెందినవాడనేది స్పష్టం. తెగలకీ, తండాలకీ, గణాలకీ, రాజ్యాలకీ రాజులైనంత మాత్రాన వారు క్షత్రియులవ్వాల్సిన అవసరం లేదు. వాలి, సుగ్రీవులు, రావణుడు, బలి చక్రవర్తి, తాటకి క్షత్రియులా? అశోకుడూ, శివాజీ క్షత్రియులా? మొట్ట మొదటి ప్రపంచ నాగరికతలైన సింధూ నాగరికతా (హరప్పా, మొహంజొదారో, డోలవీర, etc.,) నిర్మాతలు క్షత్రియులా??

★బుద్ధుడు పుట్టేనాటికి అప్పట్లో (క్రీ.పూ. 6౦౦-300) మన భూ భాగంలో ఉన్న మతాలు రెండే, అవి:

1.వైదిక మతం = Orthodox (సాంప్రదాయ).
2.అవైదిక = Heterodox (సాంప్రదాయేతర) మతాలు. (అప్పట్లో 62 అవైదిక మతాలు ఉండేవి)
★వైదిక మతం బ్రాహ్మణ భావజాలంతో కూడుకున్నది (అప్పటికే సమాజంలో వర్ణ వ్యవస్థ వేళ్ళూనుకుని ఉంది. ' రుగ్వేదం'లోని 'పురుష సూక్తం' లో మొట్టమొదటిసారిగా చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది; కానీ పంచముల గురించి, కుల వ్యవస్థ గురించి ఇక్కడ వివరణ లేదు, అవన్నీ "మను స్మృతి" లో  వివరించబడ్డాయి)..

ఈ వైదిక మతానికి (బ్రాహ్మణ వ్యవస్థకి) వ్యతిరేకంగా ప్రారంభించబడినవే 'అవైదిక' మతాలు (example: అజివిక, చార్వాక, లోకాయత లాంటి మతాలు). ఈ అవైదిక మతస్థులనే 'శ్రమణులు' అంటారు.

★ఆనాడు వైదిక (బ్రాహ్మణ) మతానికి వ్యతిరేకంగా బుద్థుడు ప్రారంభించిన 'ఉద్యమమే' - 'బౌద్థం'.
బుద్థుడు నాస్థికుడు (Atheist), శ్రమణుడు. బుద్ధుడు ఎలాంటి మతాన్నీ స్థాపించలేదు, అలాగే తనని తాను 'దేవుడిగా' ఎప్పుడూ చెప్పుకోలేదు.. (తన తదనంతరం బౌద్ధం ఒక మతంలా వ్యాపిస్తుందని, అది తిరిగి హీనయాన, మహాయాన, వజ్రయానాలుగా ముక్కలవుతుందని, తన తదనంతరం తనని ఆసరాగా చేసుకుని గుడులూ, గోపురాలు వెలుస్తాయని, విగ్రహారాధన మొదలవుతుందని బుద్ధుడు అస్సలు ఊహించలేదు). ఆయన ఒక సంస్కర్త. ఆయన కేవలం ఉద్యమం మాత్రమే ప్రారంభించారు. ఈ ఉద్యమమే తరువాత పరిపూర్ణ మతాలుగా ఆవిర్భవించాయి. వాటిలో ముఖ్యమైనదే 'బౌద్ధం'. బుద్ధుని మార్గాన్ని అనుసరించినవారు 'బౌద్ధులయ్యారు.'

★భారత దేశంలో మొట్టమొదటిసారిగా విగ్రహారాధన, మతకట్టడాలైన దేవాలయాలు మొదలైంది బుద్థునితోనే అంటే మీరు నమ్మలేరేమో!! కానీ ఇది వాస్తవం. బౌద్ధ భిక్షులు బుద్ధుడ్ని దేవుడిలా పూజించడం మొదలుపెట్టాకే మన దేశంలో విగ్రహారాధన, గుడులూ, గోపురాలూ పుట్టుకొచ్చాయి తప్ప, అంతకు ముందు మన దేశంలో అలాంటివేవీ లేవు. 'కుషాణుల' (తొచారియన్ - మధ్య ఆసియా, చైనా నుండి వచ్చిన మంగోలాయిడ్ జాతికి చెందిన చెంఘిజ్ ఖాన్ వారసులు) 3వ రాజు అయిన 'కనిష్కుడు' తన నాణాలపై రెండవ వైపున మొట్టమొదటిసారిగా బుద్ధుడిని మానవ రూపంలో ముద్రించాడు, ఇక అక్కడి నుండి విగ్రహారాధన మొదలైంది. ఈ బంగారు నాణాలకే 'దీనార్' లని పేరు. (కానీ నిజానికి బుద్ధుడు కోరుకుంది ఇది కాదు).

★బుద్ధుని యొక్క గురువులు ఇద్దరు. వారు : 1. రుద్రక 2. అలారక లామా.
ఈ ఇద్దరి దగ్గరా బుద్ధుడు 2 సంవత్సరాలు వేద విద్యనభ్యసించాడు. కానీ వేదాలు ఒఠ్ఠి మూర్ఖపు రాతలని, వేదాలలో ఏమీ లేదని గ్రహించి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆ తరువాత ఆయన 'తధాగతుడు (అన్ని వాస్తవాలు/ నిజాలు తెలిసినవాడు) గా రూపాంతరం చెందాడు…

★అప్పట్లో ఉనికిలో ఉన్న మూడు భాషలలో (సంస్క్రత, పాళీ, ప్రాక్రుతం), బ్రాహ్మణులు మాత్రమే మాట్లాడే సంస్క్రతాన్ని కాదని, సామాన్యులు మాట్లాడే 'పాళీ' భాషను( బ్రాహ్మీ లిపి) మాత్రమే బుద్ధుడు ఉపయోగించాడు. జైనులు ప్రాక్రుతాన్ని ఉపయోగించారు.

మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు జైన మతాభిమాని అయితే, మొట్ట మొదటి భారత చక్రవర్తి అశోకుడు బౌద్ధ మతాభిమాని...
★బహుజనులు అనే భావన, సర్వమానవ సమానత్వం/ సౌభ్రాత్రుత్వం, శాంతి, జీవహింస నిషేధం (ముఖ్యంగా పశుసంపదను యజ్ణయాగాలకు బలిచేయకుండా అడ్డుకున్నాడు) లాంటివన్నీ బుద్ధుడు ప్రవేశపెట్టిన సంస్కరణలే…

కాగా, ద్రవిడ, బౌద్ధ, వైదిక సంస్క్రతుల సమ్మేళనంతో హిందూ మతం తన పరిపూర్ణతని సాధించుకుంది..

*బౌద్ధం లోని ఎన్నో సంస్కరణలని నాటి బ్రాహ్మణ వాదులు అరువు తెచ్చుకుని తమ హైందవ మతానికి సంపూర్ణతని చేకూర్చుకుని, బౌద్ధం దెబ్బకి పూర్తిగా అంతరించిపోతున్న తమ హైందవాన్ని నిలబెట్టుకోవడమేగాక, భారత్ లో బౌద్ధాన్ని అతి క్రూరంగా నిర్మూలించగలిగారు*

★బుద్ధుడు హిందువే అయితే మరి భారత దేశంలో బౌద్ధం ఎందుకు నిర్మూలించబడింది? బౌద్ధ భిక్షవులందరినీ ఆనాటి వైదిక రాజులు కత్తికో కండగా నరికి బౌద్ధారామాలన్నిటినీ నాశనం చేసి, ఆ బౌద్ధారామాలను తమ వైదిక మతాలయాలుగా (ముఖ్యంగా శైవ, వైష్ణవాలయాలుగా) ఎందుకు మార్చారు?

బుద్ధుడు విష్ణువు అవతారం, బుద్ధుడు హిందువు లాంటి పుక్కిట పురాణాలు, కల్పిత గాధలు అన్నీ కూడా బౌద్ధులను వైదిక మతం లోకి మార్చి తమ ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు కుహనా బ్రాహ్మణ వాదులు అల్లిన కట్టుకధలు, కుట్రలు మాత్రమే…

★నిజంగా బుద్ధుడు విష్ణువు అవతారమే అయితే,,,, చిట్టచివరి మౌర్య చక్రవర్తి అయిన 'బ్రుహద్రదుడి' ని వధించి, మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి 'శ్రుంగ' రాజ్యాన్ని స్థాపించిన అతని (బ్రుహద్రదుని) సేనాని, బ్రాహ్మణుడైన "పుష్యమిత్ర శ్రుంగుడు" ఎందుకు అనేక లక్షలమంది నిరాయుధులూ, శాంతి కాముకులైన బౌద్ధులను అతి క్రూరంగా వధించి తిరిగి వైదిక మత ప్రాభవాన్ని నెలకొల్పి బౌద్ధాన్ని అంతం చెయ్యాలని చూశాడు??? ఇతని కాలంలోనే, బౌద్ధులను చంపినవారికి బహుమతిగా బంగారు నాణాలతో పాటు బిరుదులు కూడా ఎందుకివ్వబడ్డాయి???

బౌద్ధంలోని 3 శాఖలలో (హీనయానం, మహాయానం, వజ్రయానం) వజ్రయానాన్ని ప్రోత్సహించి, వారు నివసించిన ప్రాంతాలను లంజల దిబ్బలుగా మార్చింది ఎవరు???

ఇదంతా ఒక క్రమపద్ధతిలో బౌద్ధంపై హైందవం చేసిన అతి క్రూరమైన, హేయమైన దాడి.....
★ఇండియాలో బౌద్ధాన్ని అంతం చేయడంలో 'ముస్లిం రాజుల' పాత్ర కూడా తక్కూవేమీ కాదు…

1194 A.D. లో, 'మహమ్మద్ ఘోరీ' సేనాని అయిన "భక్తియార్ ఖిల్జీ" బెంగాల్ మీదకి దండెత్తి వచ్చి, అప్పటి రాజు 'లక్షణ సేనుని' (సేన రాజ్యం) ఓడించి, అక్కడి బౌద్ధుల విశ్వ విద్యాలయాలైన "విక్రమశిల విశ్వ విద్యాలయాన్నీ", "నలంద విశ్వ విద్యాలయాన్నీ" రెండింటినీ ధ్వంసం చేసి, అందులో మిగిలి ఉన్న కొన్ని వందలమంది బౌద్ధులను అత్యంత క్రూరంగా చంపడంతో భారత్ లో బౌద్ధం అంత్య దశకు చేరుకుంది....

★1956, అక్టోబర్ 14 న బాబాసాహెబ్ అంబేడ్కర్ తో పాటు బౌద్ధాన్ని స్వీకరించిన ఆయన అనుచరులు 5 లక్షల మంది ఆ తరువాత బౌద్ధాన్ని సరిగా ఆచరించలేకపోయారు.... ఒక సాధారణ గ్రామ దేవతని పూజించినట్లుగా వీరు ఇంట్లో ఒక ఫోటోని పెట్టుకుని బుద్ధుని పూజించారే తప్ప, బౌద్ధాన్ని పూర్తిగా ఆచరించలేకపోయారు.. ఆ తరువాత అదికూడా పోయి మరలా క్రైస్తవ మిషనరీల చొరవతో దళిత బహుజనులు చాలావరకు క్రైస్తవులుగా మారిపోయారు…

తాను బౌద్ధాన్ని స్వీకరించిన రెండు నెలలకే (1956, December 6) బాబాసాహెబ్ మరణించడంతో ఇండియాలో బౌద్ధం కూడా చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు...
తాను హిందువుగా చావనని ప్రతినబూనిన రోజునే బాబాసాహెబ్ బౌద్ధాన్ని స్వీకరించి ఉంటే, ఈ రోజున ఇండియాలో దళిత బహూజనుల పరిస్థితి, కులాల పరిస్థితీ మరోలా ఉండేదేమో...
★చరిత్రను చరిత్రగా వాస్తవ ద్రుక్పధంతో పరిశీలించాలే తప్ప, ఎవరిష్టానుసారం వారు చరిత్రను వక్రీకరిస్తూ పోతుంటే పురాణాలూ, మత గ్రంధాలు చెప్పినవే వాస్తవాలై కూర్చుంటాయి, వాటిదే రాజ్యమవుతుంది.

@నాగరాజు గుడిశా.

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు