అజంతా గుహలు మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ జిల్లాలో జల్పగావ్ రైల్వే స్టేషన్ నుండి కేవలం 59 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు ఔరంగాబాద్ నుండి 104 కిలోమీటర్ల దూరంలో, ఎల్లోరా నుండి 76 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.వీటిని క్రీ.పూ. 2 వ శతాబ్దం నుండి క్రీ.పూ 480 వరకు నాటి 30 రాతి గుహలుగా చెక్కబడిన బౌద్ధ స్మారక చిహ్నాలు .ఇవి గుబురుగా పైకి ఎగసిన వృక్షాల నడుమ గుర్రపు నాడా ఆకారంలో 250 అడుగుల ఎత్తుతో ఉన్న లోతైన లోయ పక్కన ఈ గుహలు ఉన్నాయి. దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు పశ్చిమ కనుమల మధ్య అడవిలో వెన్నెలగా ఉండిపోయిన ఈ గుహలను 1819లో యాదృచ్ఛికంగా పునరావిష్కృతమైనాయి.
ఈ గుహల్లోని మందిరాల్లోని శిల్పకళ , చిత్రకళ,
వాస్తుశిల్పం ఈ మూడు అజంతాను ప్రపంచ ప్రఖ్యాతి పొందేలా చేశాయి.
బుద్ధుని జీవితంలోని ఘట్టాలు, జాతక కథలు అత్యంత సున్నితంగా శ్రద్ధతో చిత్రీకరించారు ఆనాటి చిత్రకారులు. మానవ జీవితంలోని నీతి, ధర్మ విలువలు అందులో వ్యక్తమవుతాయి.చిత్రాల్లోని ముఖాలలో ప్రేమ, కరుణ, విషాదం, శాంతి వంటి భావాలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఈ గుహలను సందర్శించిన వారు గోడలపై ఉన్న స్త్రీ చిత్రాలను,ఆ స్త్రీల వంపుసొంపులను, పొడవైన కళ్లతో, ఆకర్షణీయమైన ముఖావయవాలతో, విరివిగా ఆభరణాలు ధరించిన శరీర సొగసులను, వారిలో కనిపించే ఉత్సాహభరితమైన జీవత్వం చూసి ఆశ్చర్య చకితులవుతారు. చిత్రాల్లో వ్యక్తులు కదిలిపోతున్నట్లుగా కనిపిస్తాయి. చేతులు ఊపుతూ, కళ్ల తిప్పుతూ, శరీరవంపులతో — అవి కదలికను సూచిస్తాయి. ఒకే ఫ్రేములో ఇద్దరు వ్యక్తులు పరస్పరం సంభాషిస్తున్నట్లు కనిపిస్తుంది.
ప్రాచీన భారతీయ చిత్రకారులు అనుసరించిన శైలిని అప్పటి సౌందర్యశాస్త్ర గ్రంథాల్లో వివరించారు.
రాతి గోడలపై సున్నం, మట్టి, బియ్యం పిండి జావా మొదలైన పదార్థాలతో మిశ్రమం చేసి పూత (plaster) వేసేవారు.దీని మందం సుమారు ఒకన్నర సెంటీమీటర్ల వరకు ఉండేది. ఈ పూత ఎండిన తర్వాత దానిమీద చిత్రాలు వేశారు.ఆపై మెత్తగా పొడి సున్నం పొరను వేసి మృదువైన ఉపరితలాన్ని ఏర్పరచేవారు.
అజంతా చిత్రాలు “Tempera” శైలికి దగ్గరగా ఉన్నాయి. ముందుగా చిత్రాన్ని బొమ్మలుగా గీసి, తరువాత రంగులు వేసేవారు.కొన్ని చోట్ల “Secco Fresco” శైలి (ఎండిన పూతపై రంగులు వేసే విధానం) వాడారు.ఈ చిత్రాల్లో ఉపయోగించిన రంగులన్నీ సహజసిద్ధమైనవి (natural pigments) ఖనిజాలు, వృక్షాలు, మొక్కల వేర్లు, పువ్వులు, పిండిపదార్థాల నుండి తయారు చేసిన రంగులే.
రంగులలో ఉపయోగించిన వర్ణాలు పసుపు మట్టి, ఆకుపచ్చ రాయి దూళి చేసి కాల్చిన ఇటుక పొడి, దీపాల పొడి (ల్యాంప్ బ్లాక్), రాగి ఆక్సైడ్ వంటి పదార్థాలు కలిపినఎర్ర రంగు. రంగు వేసిన తరువాత మళ్లీ రెండవ పొర వేయబడేది. దానివల్ల ప్రాథమిక రూపరేఖలు కొద్దిగా కనిపించేలా ఉండేవి. తరువాత ప్రత్యేకమైన బ్రష్‌లను ఉపయోగించి రంగును నింపుతూ, పురాతన సౌందర్యశాస్త్ర భాషలో చెప్పాలంటే, చిత్రానికి "వికాసం" కలిగించేలా చేస్తారు. చివరగా నలుపు గీతలు మరియు లైట్ టోన్‌లను తగ్గించి షేడింగ్ చేయడం ద్వారా చిత్రం కీళ్లను మలుపుగా చూపించి ప్లాస్టిక్ రిలీఫ్ లాగా కనిపించేలా చేస్తారు.
గోడలపై చిత్రాల ప్రధాన ఇతివృత్తం బుద్ధుని జీవితంలోని ప్రధాన ఘట్టాలు , జాతక కథలు. ఈ ఆధ్యాత్మిక చిత్రకళలో ఆధునిక సమాజ జీవనశైలి ఒక పుష్కలంగా చిత్రించబడింది. ఈ చిత్రాలలో బుద్ధుని, బోధిసత్వులనే కాకుండా, వివిధ భావోద్వేగాల మాధుర్యంలో, భిన్న ధోరణుల్లో ఉన్న విస్తృత మానవ సముదాయాన్ని కూడా వీక్షించవచ్చు. ఇవి సమాజంలోని అన్ని వర్గాల నుండి తీసుకున్న దృశ్యాలే.
పైకప్పు భాగంలోని చిత్రాలు గోడలపై చిత్రాల మాదిరిగా కాకుండా ప్రధానంగా అలంకారిక నమూనాలుగా ఉంటాయి. ఇవి జ్యామితీయ నమూనాలు, పుష్ప అలంకారాలు, దేవతా రూపాలు, జంతువులు, పక్షులు, వృక్షాలు మొదలైనవి కలిగి ఉంటాయి.
బుద్ధుని ఆధ్యాత్మిక శోభతో పాటు ఇన్ని రకాల సామాజిక కళాసౌందర్యాన్ని కళాత్మకతతో చిత్రించిన అజంతా చిత్ర శైలి అప్పటి కళాకారుల విశిష్టమైన కళా దృష్టిని ప్రతిబింబిస్తోంది.

Comments
Post a Comment