నలందా



నలంద (Nālānda) ప్రస్తుత బీహరు రాష్ట్రంలో ఉన్న ప్రాచీన విశ్వవిద్యాలయం. నలందా అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం.  
       చైనా యాత్రీకుడు హ్యూయన్ త్సాంగ్ నలందా పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. హ్యూయన్ త్సాంగ్ చెప్పిన రెండవ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని అందుకే నలందా అన్న పేరు వచ్చిందని వివరించాడు.
ఇది పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం సా.శ. 427 నుంచి సా.శ. 1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికంగా పాల వంశం పాలనలో ఉండేది.ఇది ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయాలలో ఒకటి." ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో సుమారుగా 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది బోధకులూ ఉండేవారు.

    బుద్ధుడు చాలా సార్లు నలందకు వచ్చినప్పుడు సాధారణంగా పావారిక మామిడితోపులో బస చేసేవాడు. అక్కడ ఉండగా ఉపాళీ-గహపతి, దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడు.

     కేవత్త సుత్త ప్రకారం బుద్ధుని కాలానికే నలంద ఎంతో ప్రాముఖ్యత కలిగి అభివృద్ధి వృద్ధి చెందుతున్న నగరం. అయితే ఆ తరువాత చాలా కాలానికి గానీ విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందలేదు. బుద్ధుని శిష్యుడు సారిపుత్త నలందలోనే పుట్టి, ఇక్కడే మరణించాడు.

      నలంద యూనివర్శిటీని పునరుద్ధరించాలనే ఆలోచనను 2005లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తొలిసారిగా ప్రతిపాదించారు. బీహార్‌లోని నలందా చారిత్రాత్మక విద్యా స్థలం శిథిలాల సమీపంలోనే ఈ విశ్వవిద్యాలయం నిర్మించబడుతోంది. 2007 లో దీనికి అమర్త్య సేన్ ని ఛాన్సలర్ గా ఈ ప్రాజెక్ట్‌లో 2014 వరకు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అనేక దేశాలు కూడా పాలు పంచుకుంటున్నాయి.

యూపీఎ హయాంలో 2007 లో మొదలైన ప్రాజెక్ట్ 10 సం. ల వరకు శాశ్వత భవనాల నిర్మాణ పనులు జరగలేదు. మోదీ ప్రభుత్వం వచ్చాక వీటి నిర్మాణాలపై దృష్టి సారించారు.

సెప్టెంబర్ 1, 2014న పురాతన నలంద నుండి కేవలం 10 కి.మీ దూరంలో ఉన్న బౌద్ధ యాత్రికుల పట్టణం రాజ్‌గిర్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లోని తాత్కాలిక వేదిక నుండి అకడమిక్ సెషన్ ప్రారంభమైంది. దాదాపు 800 ఏళ్ల అనంతరం ఈ విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం కావడం విశేషం.

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు