జీవితం పట్ల ఆశావాహ దృక్పథం కలిగి ఉండాలి. ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.
కుటుంబంతో, స్నేహితులతో కలిసి సంతోషంగా రోజులో కొంత సమయాన్ని గడపాలి.
రోజులో కొంత సమయాన్ని మానసిక దృఢత్వాన్ని పెంచడానికి పుస్తకాలను చదవాలి. మైత్రి భావనను పెంచుకోవడానికి ప్రపంచంలో అందరూ బాగుండాలని సానుకూల దృక్పథంతో కోరుకోవాలి.
ద్వేషం దేనికీ పరిష్కారం కాదు.
బుద్ధుడు తన కాలంలోని బ్రాహ్మణులలోని 'బ్రాహ్మణులు ఎక్కువ వారు, తక్కిన వారు తక్కువ వారు, జ్ఞానాన్ని, ముక్తిని పొందటానికి బ్రాహ్మణులకు మాత్రమే హక్కు ఉంది' అనే ఆధిక్యతాభావాన్ని తిరస్కరించాడు. మానవ సమానత్వాన్ని ప్రకటించాడు. అంతేగాని బ్రాహ్మణులను ఎవ్వరినీ ద్వేషించలేదు. వేదాలను చదవటంవల్ల, చదివించటం వలన, యజ్ఞ యాగాలవలన దుఃఖవిముక్తి కలుగదని, రాగ, ద్వేష, మోహాలను వదలటం వల్లనే అది సాధ్యమౌతుందని అన్నాడు. బ్రాహ్మణ పదాన్ని బుద్ధుడు జ్ఞానికి పర్యాయంగా ఉపయోగించాడు. పుట్టుక తో ఎవడూ బ్రాహ్మణుడు కాడని చెప్పాడు. వర్ణాశ్రమ ధర్మాలను తిరస్కరించాడు. అతడు జ్ఞానవాది. ఆయన మాటల్లోని సత్యాన్ని గుర్తించిన ఎందరో బ్రాహ్మణులు ఆయన శిష్యులైనారు.
వేలసంవత్సరాలు అంటరాని వారుగా బాధలననుభవించిన శూద్రులు, అతిశూద్రులు( దళితులు )స్వతంత్రభారతంలో కొంతవరకు స్వేచ్ఛను పొందారు. మానవసమానత్వాన్ని బోధించిన బౌద్ధాన్ని స్వీకరిస్తున్నారు. బుద్ధుడు బ్రాహ్మణులతో విబేధించిన అంశాలను తెలుసుకొంటున్నారు. ప్రచారం చేస్తున్నారు. దాన్ని బ్రాహ్మణ ద్వేషం అనలేము. అయితే జనం బ్రాహ్మణులను ద్వేషిస్తే అది ఆ బ్రాహ్మణుల స్వయంకృతమే. అయితే ద్వేషం దేనికీ పరిష్కారం కాదు. బ్రాహ్మణులు తమ ఆధిక్యతాభావాన్ని వదలుకొని అందరితో కలిసి పోవాలి. దీనికి ఇదే పరిష్కారం.
____ భంతే ధమ్మరక్ఖిత
Comments
Post a Comment