భారత దేశంలో బౌద్ధమత ఆవిర్భావం - పతనం.


భారత దేశంలో బౌద్ధమత ఆవిర్భావం - పతనం.         
                          --- Prabhakar Mandaara

భారతదేశం పరస్పరం కలహించుకునే మతాలకు నెలవు. 
భారత దేశం లో మతం పోశించినంత పాత్రను మరే దేశంలోనూ మతం పోషించి ఉండదు. 
భారతదేశ చరిత్ర అంటే బౌధమతానికీ బ్రాహ్మణ మతానికీ మధ్య జరిగిన నిరంతర సంఘర్షణ తప్ప మరేమీ కాదు. ఈ వాస్తవం ఇంతగా మరుగున పడిపోయిన్దంటే ఇవాళ ఎవరూ ఈ మాటను వెంటనే ఒప్పుకోలేరు. అలాంటి సూచనను కూడా బహుశా ఎవరూ ఇష్టపడకపోవచ్చు. భారతదేశ చరిత్ర ఆర్యుల దండయాత్రతో మొదలవుతుంది. ఆర్యులు ఈ దేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడే తమ సంస్కృతిని పాడుకోలిపారు. ఆర్యులకు సంబంధించిన వాస్తవాలు, వాళ్ళ సంస్క్రుతి, వాళ్ళ మతం, వాళ్ళ సామాజిక వ్యవస్థ మాట ఎలా ఉన్నప్పటికీ వాళ్ళ రాజకీయ చరిత్ర గురించి మాత్రం మనకు తెలిసింది చాలా తక్కువ. ఆర్యేతరులకన్నా తాము యెంతో గొప్పవాళ్ళమని చాటుకోవడమే తప్ప ఆర్యులు తమ రాజకీయ విజయాల గురించి చరిత్రకు ఏమీ మిగల్చలేదు.

భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటి గొప్ప సంఘటన క్రీ.పూ. 642లో బీహార్ మగధ సామ్రాజ్య స్థాపనే. మగధ సామ్రాజ్య స్థాపకుడు శిశునాగుడు, ఆర్యేతర నాగజాతికి చెందినవాడు.
శిశునాగుడితో చిన్న రాజ్యంగా మొదలై అనేక మంది సమర్థులైన శిశునాగ వంశస్థుల పాలనలో మగధ సామ్రాజ్యంగా ఎదిగింది. ఈ వంశంలో ఐదవవాడైన బింబిసారుని కాలంలో బాగా విస్తరించి మగధ సామ్రాజ్యంగా పేరు సంపాదించుకుంది. ఈ దేశాన్ని శిశునాగ వంశం క్రీ.పూ. 413 వరకు పరిపాలించింది.

అదే సంవత్సరం శిశునాగ వంశానికి చెందిన చక్రవర్తి మహానందుడిని నందుడు అనే సాహసికుడు హత్య చేశాడు. దరిమిలా మగధ సింహాసనం అధిష్టించి అతను నంద వంశ పాలనకు ఆద్యుడయ్యాడు. నంద వంశం మగధ సామ్రాజ్యాన్ని క్రీ.పూ.322 వరకు పరిపాలించింది. 
చిట్టచివరి నందరాజును కూలదోసి చంద్రగుప్తుడు మౌర్య వంశ పాలనను ప్రారంభించాడు. చంద్రగుప్తుడు శిశునాగ వంశానికి చెందిన చిట్టచివరి రాజకుటుంబానికి చెందినవాడు. అందువల్ల చంద్రగుప్తుడి విజయం మగధ సామ్రాజ్యం మీద నాగవంశ పాలనను పునరుద్ధరించిందని చెప్పవచ్చు.

మౌర్యులు విజయపరంపరలతో తమ మగధ సామ్రాజ్యాన్ని విపరీతంగా విస్తరించుకున్నారు. అశోకుని హయాంలో ఈ సామ్రాజ్యం మరింత విస్త్రుతంగా పెరిగిపోయింది. మొట్టమొదటి బౌద్ధమత చక్రవర్తి అయిన అశోకుని కాలం లో (క్రీ.పూ. 273 - 232) ఈ సామ్రాజ్యాన్ని మౌర్య సామ్రాజ్యం అనీ లేదా అశోక సామ్రాజ్యం అనీ వ్యవహరించేవారు. ఆయన కాలంలో బౌద్ధమతం అనేక ఇతర మతాలలో ఒకటిగా లేదు. అశోకుడు బౌద్ధమతాన్ని అధికార మతంగా చేశాడు. అది బ్రాహ్మణిజానికి అతి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అశోకుని సామ్రాజ్యంలో బ్రాహ్మణులు రాజాదరణను పూర్తిగా కోల్పోయారు. వారు అప్రధానమైన ద్వితీయ స్థాయికి నెట్టివేయబడ్డారు. బ్రాహ్మణీయ మతానికి మూలాధారమైన జంతుబలులను నిశేధించడంతోనే అది కుప్పకూలి పోయింది. అంతవరకు అనుభవించిన రాజాధరణతో పాటు బ్రాహ్మణులు తమ జీవనాధారాన్ని కూడా కోల్పోయారు. జంతుబలుల ద్వారానే బ్రాహ్మణులకు రుసుము రూపంలో బాగా ఆదాయం లభించేది. అదే వారికి ప్రధాన జీవనాధారంగా ఉండేది. మౌర్య సామ్రాజ్యం అంతరించే వరకు  దాదాపు 140 సంవత్సరాలపాటు బ్రాహ్మణులు అణగారిన వర్గంగా ఉండిపోయారు.

తమ కష్టాలు కడతేరాలంటే బ్రాహ్మణులకు బౌద్ధ రాజ్యం మీద తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణం చేతనే పుష్యమిత్రుడు మౌర్య పాలకుడి మీద తిరుగుబాటు బావుటాను ఎగురవేశాడు. గోత్రం ప్రకారం పుష్యమిత్రుడు సుంగ్ కు చెందినవాడు. సుంగాలు సామవేది బ్రాహ్మణులు. అంటే జంతుబలులను, సోమ సమర్పణలను నమ్మేవారు. అశోకుడు తన మొట్టమొదటి శిలాశాసనం ద్వారా జంతుబలులను నిశేధించగానే బాగా దెబ్బ తిన్నవారు సుంగాలే. అందువల్ల తమ స్థాయిని తగ్గించి తమ కష్టాలకు కారణమైన బౌద్ధ రాజ్యాన్ని కూలదోసి తిరిగి తమదైన బ్రాహ్మణీయ మత పద్ధతులను ప్రాచుర్యంలోకి తెచ్చుకునేందుకు వారు ప్రయత్నించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అధికార మతంగా కొనసాగుతున్న బౌద్ధమతాన్ని నాశనం చేసి భారతదేశం లో బ్రాహ్మణులకు సార్వభౌమత్వాన్ని తిరిగి నెలకొల్పడమే పుష్యమిత్రుడు రాజహత్యకు పాల్పడడం వెనకున్న కారణం. బౌద్ధమతాన్ని ఓడించి బ్రాహ్మణ మతం రాజకీయ శక్తిగా ఎదిగేందుకు దారితీసిన పరిస్థితులు మరో రెండున్నాయి. మొదటిది పుశ్యమిత్రుడి వ్యక్తిత్వం.

పుష్యమిత్రుడు సింహాసనం అధిశ్టించిన తర్వాత అశ్వమేధయాగం అంటే గుర్రం బలిని నిర్వహించాడు. తన సార్వభౌమత్వాన్నీ శక్తినీ చాటుకునేందుకే రాజులు ఈ వైదిక క్రతువును నిర్వహిస్తారు. విన్సెంట్ స్మిత్ ఇలా అంటారు:

"జంతువుల ప్రాణాలకు విలువ ఇవ్వడం అనేది బౌద్ధ ధర్మం లో అత్యంత ముఖ్యమైనది. అందువల్లనే అశోకుడు నిర్దిష్ట శాసనం ద్వారా జంతుబలులను నిషేధించాడు. కొన్ని రాఖాల బ్రాహ్మణీయ ఆరాధనా పద్ధతులలో జంతుబలి అనివార్యంగా వుండేది.సాంప్రదాయవాదులు అట్టి జంతుబలి వల్ల తమకు సౌభాగ్యం లభిస్తుందని నమ్మేవారు. పుశ్యమిత్రుడి అశ్వమేధయాగం జంతుబలి నిషేధం మీద ఎక్కుపెట్టిన తోలి బ్రాహ్మణీయ ప్రతిస్పందన. ఆ తదనంతరం సముద్ర గుప్తుడు ఆయన వారసుల కాలంలో ఈ ఆచారం మరింతగా విజ్రుంభించింది."
పుష్యమిత్రుడు అధికార పగ్గాలు చేతపట్టిన తరువాత బుద్ధులకు బుద్ధమతానికీ వ్యతిరేకంగా హింసాత్మక, విషపూరిత ప్రచారాన్ని చేపట్టాడు.
బౌద్ధ సన్యాసులకు వ్యతిరేకం పుష్యమిత్రుడు జారీ చేసిన ఒక ఆదేశాన్ని బట్టి బౌద్ధమతం మీద ఆటను చేసిన దాడి ఎంత దారుణంగా, నిర్దయగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. పుష్యమిత్రుడు ఒక్కొక్క బౌద్ధ సన్యాసి తలకు 100 బంగారు నాణేలు బహూకరిస్తానని ప్రకటించాడు!
బౌద్ధులపై పుష్యమిత్రుడు కొనసాగించిన హింసాకాండను అభివర్ణిస్తూ, డా. హరప్రసాద్ శాస్త్రి ఇలా అంటాడు:
"సుంగాలు, బ్రాహ్మణ సాంప్రదాయవాదులు, దురభిమానులు రాజ్యం అండతో కొనసాగించిన దాడుల  కాలంలో బౌద్ధుల పరిస్థితి ఎలా ఉండేదో ఎవరైనా సులువుగా ఊహించుకోవచ్చు. 
చైనా అధికారుల సమాచారాన్ని బట్టి ఇప్పటికీ అనేక మంది బౌద్ధులు పుశ్యమిత్రుడి పేరు ఉచ్చరించడమే  మహా పాపంగా భావిస్తున్నారు."

 - Dr. Babasaheb Ambedkar writings and speeches, Volume 3, Page 266 - 269, Translation by Prabhakar Mandaara

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు