మతము - ధర్మము
మతంతో ధర్మం ఎలా భిన్నమైనది?
మతం - ధర్మం
1. బుద్ధుడు బోధించిన ధర్మం మతంతో మౌలికంగా విభేదిస్తుంది.
2. ఐరోపాతాత్వికులు మతానికి చెప్పే అర్ధానికీ బుద్ధుని ధర్మానికి తేడా ఉంది.
3. అయితే ఈ రెండిటి మధ్య చెప్పుకోదగ్గ సమా నత్వం ఏది లేదు. అంతేకాక సిద్ధాంత పరంగా ఈ రెండిటి మధ్య గల వ్యత్యాసం చాలా ఎక్కువ.
4. ఆ కారణంగానే ఐరోపాత్వికులు బౌద్ధ ధర్మాన్ని ఒక మతంగా అంగీకరించేందుకు నిరాకరించారు.
5. అందుకు మనం బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అలా నిరాకరించినందువల్ల నష్టం వారికే, అంతేగాని బౌద్ధ ధర్మానికి ఏర్పడే హాని అంటూ ఏదీ లేదు, కాకుంటే వారు చెప్పే మతంలో ఉన్న లోపాలు దీనివల్ల స్పష్టంగా తెలుస్తున్నాయి.
6. ఈ వివాదంలో పడకుండా బౌద్ధ ధర్మం మతంతో ఎలా భిన్నమైందో పరిశీలిద్దాం.
7. మతం అనేది కేవలం వ్యక్తిగతమైనదని, దానిని ఎవరికి వారు ఆచరించుకోవాలే గాని సామాజికంగా దానిని ఉపయోగించాల్సిన అవసరం లేదని చెపుతున్నారు.
8. కానీ ధర్మం అనేది ఈ భావనకు పూర్తిగా విరుద్ధమైనది, ధర్మం సామాజిక ప్రయోజనం కోసమేననేది చాలా మౌలికమైన విషయం.
8. ధర్మమంటే మంచి ఆచరణ, అనగా మానవ జీవన విధానంలో మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన సంబంధాలను నిర్దేశించేదే ధర్మం.
10. మానవుడు ఏకాకిగా జీవిస్తున్నట్లయితే తనకెలాంటి ధర్మం ఆవశ్యకత లేదు.
11. కానీ ఇద్దరు ఒకచోట జీవిస్తున్నట్లయితే వారు ఇరువురు మధ్య వారి ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా ధర్మం అనేది అవసరమవుతుంది, దానిని కాదనడం ఆ ఇరువురిలో ఏ ఒక్కరికి సాధ్యం కాదు.
12. దీనిని మరో విధంగా చెప్పాలంటే ధర్మం లేకుండా సమాజంలో ఏ పని జరగదు.
13. సమాజం ముందు మూడే మూడు మార్గాలు ఉన్నాయి.
14. పరిపాలన నిర్వహణలో ధర్మ నియమాలు విధిగా పాటించడం మొదటిది. పరిపాలన నిర్వహణలో కీలకమైన పాత్ర నిర్వహించనట్లయితే అది ధర్మం కాజాలదు.
15. అలాంటి ధర్మ నియమాలు లేనట్లయితే అది ఆరాచకపాలనే అవుతుంది.
16. పోలీసు యంత్రాంగం తో పరిపాలన సాగించడం రెండవ మార్గం, అనగా నియంతృత్వ విధానంతో ప్రభుత్వాన్ని నడపడం.
17. సమాజానికి ధర్మ నియమాలను రూపొందించుకొని వాటి సక్రమ ఆచరణకై న్యాయశాఖను ఏర్పాటు చేసి తద్వారా ప్రజలు ధర్మ నియమాలను తప్పనిసరిగా పాటించేలా రూపొందించుకోవడం మూడవది.
18. అరాచక పాలనలో గాని నియంతత్వం పాలనలో గాని స్వేచ్ఛకు తావులేదు.
19. ఆ కారణంగా మూడో మార్గం ద్వారా మాత్రమే స్వేచ్ఛకు అవకాశం ఉంటుంది.
20. అనగా స్వేచ్ఛను కోరే వారు విధిగా ధర్మ నియమాలు అనుసరించి తీరాలన్నమాట.
21. పై వాస్తవాల దృష్ట్యా ధర్మం అనగా ఏమిటి? దాని ఆవశ్యకత ఏమిటి? బుద్ధుని ప్రబోధాలను బట్టి ధర్మమనగా ప్రజ్ఞ కరుణలతో కూడినది.
22. ప్రజ్ఞ అనగా ఏమిటి? ప్రజ్ఞ ఆవశ్యకత ఏమిటి?
ప్రజ్ఞ అనగా సరైన అవగాహన, బుద్ధుడు తన ధర్మములోని రెండు మూల స్తంభాల్లో దీనిని ఒకటిగా ఎంచుకున్నాడు, ప్రజ్ఞ లోపించినట్లయితే మూఢ విశ్వాసాలకు ఆస్కారం ఏర్పడుతుందని బుద్ధుడు తలచాడు.
23. కరుణ అనగా ఏమిటి? దాని ఆవశ్యకత ఏమిటి? కరుణ అనగా ప్రేమ (మైత్రి) కరుణలోపించినట్లయితే సమాజం జీవించి ఉండలేదు, అభివృద్ధి చెందలేదు, ఆ కారణం చేతనే బుద్ధుడు తన ధర్మానికి కరుణను రెండవ మూల స్తంభంగా ఎంచుకున్నాడు.
24. అసమాన్యమైన (అలౌకికమైన) ప్రజ్ఞ కరుణల సమ్మేళనమే బుద్ధుని ధర్మం.
30. ఇలా మతానికి ధమ్మానికి తేడా ఏమిటో తెలుస్తుంది.
రచన
బోధిసత్వ డా// బి.ఆర్ అంబేడ్కర్ గారు
బుద్ధుడు బౌద్ధ దమ్మము
సేకరణ
ఉపాసక పాము రవీంద్రనాథ్
Comments
Post a Comment