*బ్రాహ్మణిజంలో అంతర్భాగమే మూఢవిశ్వాసాలు.*
________________________
ప్రసాద్ నూకతోటి.
----------------------------------------
*కొబ్బరికాయలు కొట్టడం*
*పుచ్చకాయలు, గుమ్మడి కాయలు కొట్టడం,*
*దుశ్శకునాలు,పుణ్యస్నానాలు*పుష్కరస్నానాలు,* 
*SC,ST,BC కులాల విభజన*
      *“భారతదేశ చరిత్ర మొత్తం బౌద్ధమత బ్రాహ్మణ మతాలమద్య జరిగిన హింసాత్మక పరస్పర ఘర్షణల చరిత్ర మాత్రమే” అంటారు డాll బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు.*
                   మన సంస్కృతీ సంప్రదాయాలు, విశ్వాసాలు,  జీవన విధానం సైతం భౌద్ధమత, బ్రాహ్మణమతాల సంఘర్షణల ఫలితమే. బౌద్ధం నైతిక జీవనానికి, జ్ఞానానికి పెద్ధపీట వేస్తుంది. *“నైతికజీవనం జ్ఞానంతో ప్రారంభమై వివేకంతో ముగుస్తుంది”  అంటారు బుద్ధ.*
         బ్రాహ్మణమతం ఏ ఇద్ధరీని ఐక్యంగా ఉంచదు. అసమానతలు, వివక్షతలు,  మూఢత్వాలతో కూడిన అవమానాలకు నిలయం. ఒకే కుటుంబ సభ్యుల మధ్య సైతం అంతరాలు సృష్టించగల దుర్మార్గం బ్రాహ్మణ మతానిది. అన్నాచెల్లెళ్ల మధ్య ఆడా మగా తేడాలు. తల్లీబిడ్డల మద్ధ్య ముండమోపి  పేరుతో వైషమ్యాలను, కులాల పేరుతో మనుషుల మద్య ఆరని మంటలను రగిలిస్తుంది.  సోమరులను పూజించేటట్లు, శ్రమ జీవులను అవమానించేటట్లు చేయగలదు. అందుకోసం ప్రజలను నిరంతరం ఆజ్ఞానులుగా ఉంచుతూ కులాల పేరుతో విభజిస్తూ  వారిలో వారిని నిరంతరం ఘర్షణలు పడేటట్లు చేస్తుంది. విద్యను, సంపదను, జ్ఞానాన్ని,, వనరులను కొందరికే సొంతం చేసింది. వీటన్నిటినీ దేవుడికీ, పునర్జన్మలకు ముడివేసింది. అందుకే భౌద్ధం దేవున్నీ,పునర్జన్మను  ధుఃఖానికి హేతువులుగా గుర్తించింది.  విద్యను, వనరులను, సంపదను, జ్ఞానాన్ని తమ చేతుల్లో ఉంచుకొని ప్రజల అజ్ఞానానికి కారణమైన బ్రాహ్మణ మతం బౌద్ధం  అంటే పగ, అసూయా ద్యేషాలతో రగిలిపోయింది. హిందూమతం ఒక హిందువు తన జీవితకాలంలో ఎలా ప్రవర్తించాలో నిర్ణయించింది. పుట్టిన బిడ్డకు ఎలాంటి పేరు పెట్టాలి, ఎప్పుడు అన్నంపెట్టాలి,, ఏవృత్తి చెయ్యాలి, ఏస్త్రీని పెండ్లాడాలి, ఎప్పుడు లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఎవరితో కలసి భుజించాలి, ఏకూరగాయలు తినాలి, ఎన్నిసార్లు భుజించాలి, దైవ ప్రార్ధన ఎలా చెయ్యాలి, తాను చనిపోయిన తర్వాత శరీరాన్ని ఎలా ఖననం చేయలి, కర్మకాండలు ఎలా నిర్వహించాలి, అవి ఏ కులానికి ఏవిధంగా ఉండాలి, కర్మకాండలు ఎవరు నిర్వహించాలి,ఎప్పుడు నిర్వహించాలి అనేది పూర్తిగా  శాసించింది. ఈకర్మకాండలన్నీ  నిర్వహించే హక్కు ఒక కులానికే అంటగట్టింది.అది ఆ కులానికి గౌరవాన్ని కల్పించడంతో పాటు ఆదాయ వనరూ అయింది. విచిత్రమేమంటే విద్యావంతులైన హిందువులు  సైతం వీటినిప్రశ్నించకపోవడం, వీటన్నిటినిపెంచిపోషించటం అత్యంత విషాదకరం. "ఈ తత్వమే చరిత్రలో పైశాచికమైన యుద్ధాలకు మూలమైంది" అంటారు బాబాసాహెబ్ అంబేడ్కర్ . ఈ కర్మకాండలన్నింటిని పటిష్టపరచడం కోసం అనేక మూఢవిశ్వాసాలను ప్రజల్లో పాదుకొల్పింది, ప్రచారం చేసింది. 
            మనం చరిత్రను ఒకసారి పరిశీలిస్తే మౌర్యుల కాలానికి ముందు భారతదేశములో కులం లేదు. కేవలము చాతుర్వర్ణ వ్యవస్థ మాత్రమే ఉన్నది. చాతుర్వర్ణ వ్యవస్థలో బానిసవర్గం 85 శాతం శూదృలు. శూదృలకు విద్య, సంపద, వనరులపై హక్కులేదు. వీరు కేవలం బ్రాహ్మణ, క్షత్రియ   , వైశ్యులకు. బానిసగిరీ చేయడమే. దీన్ని బుద్ధుడు వ్యతిరేకించాడు. దుఃఖ విముక్తి సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ప్రజలను చైతన్యపరచి సర్వమానవ సమానత్వాన్ని సాధించే బోధనలుచేశాడు. ఈ భోధనలు రాజులను సైతం ప్రభావితం చేశాయి. కళింగయుద్ధం తర్వాత బౌద్ధబిక్కు ఉపగుప్తుని బోధనలతో పరివర్తనం చెంది విజయదశమినాడు  అశోకుడు బౌద్ధం  స్వీకరించాడు.  యుద్ధాలను    త్యజించాడు. పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని దీక్షగా స్వీకరించాడు. ప్రజలను చైతన్యపరచి జ్ఞానులుగా మలచడములో అనేక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నలంద, విక్రమ, వల్లభి, నాగార్జునలాంటి 300 పైగా విశ్వవిద్యా
లయాలను నెలకొల్పాడు వాటిల్లో  సుశ్రుతుడు, చరకుడు, ధన్వంతరి లాంటి ప్రపంచ మేటి  ఆచార్యులు  పని చేశారు.  విద్యలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపాడు. సంపదలను, వనరులను, భూమిని జాతీయంచేసి వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచాడు. దేశం సిరి  సంపదలతోనూ, ప్రజలు ఆనంద, ఆయురారోగ్యాలతో అన్నదమ్ములవలే సఖ్యతతో జీవించారు.   అనేక కళలను చేతివృత్తులను ప్రోశ్చహించి,వాటిని  ప్రపంచ నలుమూలలకూ ఎగుమతులు చేశారు. వర్ణవ్యవస్థను రూపుమాపి యజ్ఞ యాగాదులను, జంతువధలను నిషేదించాడు. వివక్షతలు, అసమానతలు లేని సమసమాజాన్ని నిర్మించాడు. తన సంతానాన్ని సైతం బౌద్ధభిక్షువులుగా బౌద్ధ ప్రచారానికి పురికొల్పాడు. చాతుర్వర్ణవ్యవస్థ సమసిపోయింది.కర్మకాండలు,యజ్ఞయాగాదులలాంటి మోసపూరితమైన వృత్తులతో జీవనం సాగించే బ్రాహ్మణ వర్గము జీవనోపాదిని కోల్పోయి సామాన్య జనంలాగా శ్రమ చేయాల్సి వచ్చింది. అలాంటి సమయములో పుష్యమిత్రుడు అనే బ్రాహ్మణుడు అశోకునిసైన్యములో కాల్భటునిగా చేరాడు.అశోకుని తర్వాత కాలములో సైన్యంలో ముఖ్యమైనపదవుల్లో కొనసాగుతూ బ్రాహ్మణులు కోల్పోయిన పూర్వస్థితిని నెలకొల్పాలనే దురుద్దేశముతో బిక్కుసంఘాల్లోను, సైన్యంలోను బ్రాహ్మణ, క్షత్రియులతో నింపి వారితో రహస్య సమాలోచనలు జరిపి నకిలీ  బౌద్ధులుగా దేశమంతా అన్ని విభాగాల్లోనూ  చేర్పింపచేశాడు. చిట్టచివరి మౌర్యరాజు కేవలం 14 ఏండ్ల బృహద్రధుని కాలంనాటికి సర్వసైన్యాధక్షుడైన పుష్యమిత్రశృంగుడు ఆటల పోటీలను తిలకిస్తున్న బృహద్రధుని తలను వెనకనుండి నరికివేశాడు. నకిలీబౌద్ధులుగా ఆరామాల్లోనూ,సైన్యంలోనూ  చేరిన బ్రాహ్మణ. క్షత్రియ పుష్యమిత్రుని అనుచరులు దేశవ్యాప్తంగా 80 వేల బౌధ్డబిక్కుల తలలు నరికివేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ గారుఈ ఘోరఘటనను  చరిత్రలో అత్యంత విషాదకరమైనదిగా  పేర్కొన్నారు. సింహాసనాన్ని  అధిష్టించిన *పుష్యమిత్రశుంగుడు  ఒక్కోబౌద్ధభిక్షువు తలకు 100 దీనారాలు బాహుమతిని ప్రకటించి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించుకున్నాడు. శుభకార్యాల్లోనూ పూజల్లోనూ బౌద్ధబిక్కుల తలలను సమర్పించడం ఆచారమైంది. బౌద్ధం అంతరించిన తరువాత  *బౌద్ధబిక్షువుల తలలకు బదులు కొబ్బరికాయలు గుమ్మడికాయలు పుచ్చకాయలు కొట్టడం ఆచారంగా మారింది. జనాల నానుడిలో ఇప్పటికీ నీతల పుచ్చకాయ పగిలినట్టు పగులుద్దీ అనడం మనం వింటుంటాము.*
*గృహప్రవేశాలకు గుడుల్లోనూ గుమ్మడికాయను కొట్టి దానిలో సున్నము పసుపు కలిపి రక్తములా చేసి గోడలకుఅద్దుతాము.అది బౌద్ధుల రక్తానికి చిహ్నం*.ఇలా  దేశవ్యాప్తంగా అత్యంత పైశాచిక మారణకాండ చోటుచేసుకుంది. బౌద్ధబిక్కులను నరికిన వారు దగ్గరలోని నదుల్లో స్నానాలు చేసేవారు. ఇవే క్రమేపీ *పుణ్య స్నానాలుగా మారినై.ఇలా ప్రతీసారీ స్నానం చేయలేనివారు పుష్కరానికోసారి (12 సం.కొకసారి) తప్పనిసరిగా *పుష్కరస్నానం చేయాలి అనేది ఆచారమైనట్లు తెలుస్తోంది.*

నీలకంఠ తన” ప్రాయశ్చిత్తమయూఖ”లో మనుస్మృతి  లోని శ్లోకాన్ని ఉటంకిస్తూ “బౌద్ధమతానుయాయుల్ని కానీ,పాశుపత, లోకాయుత ,నాస్తిక, మహాపాతకి మతానుయాయుల్ని కానీ తాకినవారు స్నానం చేసి శుద్ధి పొందవచ్చునంటాడు.

అపరార్కుడు తన “స్మృతిసముచ్చయం”లో బౌద్ధుల దేవాలయంలోనికి ప్రవేశించిన పాపం పోగొట్టుకోవడానికి *పుణ్యస్నానం చేయాలంటాడు.*

*ఈ పైశాచికత్వాన్నిభరించలేని అనేకమందిఅడవులకు కనిపించకుండా పారిపోయారు. వారే నేటి ఆదివాసీలు గిరిజనులు.  *లొంగిపోయినవారు అనేక కులాలుగా విభజింపబడి బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్యులకు ఊడిగంచేస్తూ పొలందున్నేవారుగా, కుమ్మరులుగా, కమ్మరులుగా, మంగలివారిగా చాకలివారిగా, పశువులుకాపరులుగా, ఇలా అనేక వృత్తులకు పరిమితం చేయబడ్డారు. వారే  బి సి లు. నిరంతరం ఎదిరిస్తూ లొంగిపోకుండా అనేక విధాలుగా చివరి దాకా  బాబాసాహెబ్ గారి మాటల్లో చెప్పాలంటే దక్షిణ *భారత దేశంలో 18వ శతాబ్దం దాకా పోరాడినవారు యస్సీలు*. ఇలా శూద్రులు, అతిశూద్రులుగా విడగొట్టబడిన ఒకనాటి బౌద్ధులు, అన్నదమ్ములు  బి.సి, ఎస్.సి, ఎస్.టి.లు. ఇలా బౌద్ధజీవితం గడిపిన ఎస్సీ,ఎస్టీ, బీసీలు  తమకు అనువుగా ఉన్నప్పుడంతా బ్రాహ్మణ, క్షత్రియులను వ్యతిరేకిస్తూ , వారి కర్మకాండలనూ ,పూజలనూ, వారినీ వ్యతిరేకించే క్రమంలో శుభశకునాలు, దుశ్శకునాలు ఏర్పడినై.  
            సంస్కృత నాటకం “మృచ్చకటికం” ఏడవ అంకంలో నాయకుడు చారుదత్తుడు అతని చెలికాడు నాయిక వసంతసేన కోసం ఎదురుచూస్తూ ఆమె ఎంతకూ రాకపోయేసరికి వెళ్లిపోబోతున్న సమయంలో ఒక బౌద్ధభిక్షువు ఎదురు రావడాన్ని చూచి ఎంతటి దుశ్శకునం అంటాడు.  బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులే కాదు ఎస్సీ,ఎస్టీ, బీసీలు  సైతం బ్రహ్మణులు ఎదురు వస్తే దుశ్శకునంగా భావిస్తారు.
                    “ హిందూ మ్యానర్స్ అండ్ కస్టమ్స్” అనే బుక్ లో Abbe Dubois పట్టణాల్లో పరయాలు (ఎస్.సి.లు). బ్రాహ్మణుల ఇళ్ల సమీపానికి లేదా ఇండ్ల మీదుగా వెళ్ళడాన్ని ఎవరూ  ఆపలేరు కానీ గ్రామాల్లో పరయాలను బ్రాహ్మణ వీధిలోనికి రానివ్వరు.అలాగే బ్రాహ్మణులను పరాచేరి (పరాయాలునివసించేవాడ) ల్లోనికి ఎట్టిపరిస్థితుల్లోనూ  రానివ్వరు. 
           తంజావూరు గెజిట్ సంపాదకుడు  “హెమ్మింగ్ వే” ఇలా అంటారు, తంజావూరు జిల్లాల్లోని పరయన్, పల్లవ్ , చక్కలియన్ కులాలు బ్రాహ్మణులను తమ వాడలలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ  రానివ్వరు. 
       మైసూర్లోని హొళీయ వాడలు ఊరికి బయట ఉంటాయి. ఆ వాడలోనికి బ్రాహ్మణులెవరైనా ప్రవేశిస్తే అందరూ చేరి చెప్పుల్తో కొడతారు. ఇతరకులాలవారైతే వాడలోకి రావచ్చు. ఇండ్లలోనికి రాకూడదు. నేటి దౌర్భాగ్య SC,ST,BCలు బ్రాహ్మణులను పౌరోహితులుగా ఆహ్వానిస్తున్నారంటే ఎంత సిగ్గు లేని తనం??
         1891వ సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం జనగణన చేయడానికి  ఎస్సీ,ఎస్టీ, బీసీ కులాలను గుర్తించడానికి  వారి జీవన పరిస్థితులను అధ్యయనం చేసి వారిలో SC లను క్రింది విధంగా  గుర్తించారు.
1.ఎవరైతే బ్రాహ్మణులను వ్యతిరేకిస్తారో          
2.ఎవరైతే మంత్రాలను వ్యతిరేకిస్తారో
3.ఎవరైతే చనిపోయినవారిని పూడ్చిపెడతారో
4.ఎవరైతే పశుమాంసాన్ని భుజిస్తారో
5.ఎవరి ఇండ్లు ఊరికి దూరంగాఉంటాయో 
6.ఎవరైతే అసహ్యకర వృత్తులను చేస్తుంటారో  వారిని ఎస్.సి.లుగా గుర్తించారు.
                సోమరులైన బ్రాహ్మణులు శ్రామికులైన బహుజన కులాలను కూడా అపశకునాలుగానే చూస్తారు కంసాలి, మంగలి, కుమ్మరి, చాకలి, వడ్డెర లాంటి కుల వృత్తులు నిర్వహించే వారు, వారి పనిముట్లతో ఎదురైతే అపశకునంగా భావిస్తారు. అలాగే ద్రవిడుల రంగు అయిన నలుపును, నల్లని జంతువులను, నాగుల (బహుజనుల) దైవం అయిన నాగుపామును సైతం అపశకునంగా భావిస్తారు. 
        అలాగే ఈ దేశానికి వలస వచ్చిన దేశదిమ్మరులైన ఆర్యులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తమ స్త్రీలతో వలస రాలేదు. ఇక్కడకు వచ్చి ఈదేశ మూలనివాసులైన సింధు నాగరికతా వారసులైన ద్రవిడుల స్త్రీలనే చెరబట్టి సంతనాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అందుకే "స్త్రీలందరూ శూద్రులే"నన్నది మనుధర్మశాస్త్రం. స్త్రీలను (వధువు అంటే దాసి) దాసీలు గానే చూశారు తప్ప మనుషులుగా చూడలేదు. ఆ క్రమములోనే  వీరినిమొదటినుంచి అమానవీయంగా అణగదొక్కారు.

         సంఖ్యాల్లో కూడా అశుభసంఖ్యలు, అదృష్ట సంఖ్యలు
      సంఖ్యాశాస్త్రములో 9 ని బ్రహ్మ సంఖ్య అంటారు.  బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణులు పన్నిన పన్నగాల్లో 9 చాలా కీలకమైనది. 
కృతయుగం : 1728000సం. మొత్తం అంకెలను కూడితే 18  దాన్ని మళ్లి కూడితే  9
త్రేతాయుగం : 1296000సం.  దాన్ని మళ్ళీ కూడితే. . . .18 దాన్ని మళ్లి కూడితే  -9
ద్వాపరయుగం-864000సం.  ,,           ,,       ,,                18 – దాన్ని మళ్లి కూడితే  9   
కలియుగం: 432000 సం.      ;;            ;;       ;;                  9     
మహాభారతం 18 పర్వాలు  : దాన్ని కూడితే  9,  కురుక్షేత్రం జరిగినది   18 రోజులు=  9
కురుక్షేత్రంలో పాల్గొన్నసైన్యం 18అక్షౌ
హిణీలు=9 
పురాణాలు : 18=9  ,  ఉపపురాణాలు :18 = 9  గృహ్య సూత్రాలు: 18 = 9, స్మృతులు : 18 = 9
            అంకెల్లో  తొమ్మిదిపెద్దది కాబట్టి దానం స్వీకరించేటప్పుడు సంభావనలు స్వీకరించేటప్పుడు నవధాన్యాలు , నవరత్నాలు,రోజులు లెక్కించేటప్పుడు నవరాత్రులు, ఉత్సవాలు అన్నీ  9 వుండడానికి కారణం  దోపిడీకి అనువైన సంఖ్య కావడమే. 
            ఎనిమిది దురదృష్ట సంఖ్య కావడానికి కారణం బౌద్ధులు 8 కి ప్రాధాన్యత నిచ్చారు కాబట్టి. 10 కూడా బౌద్ధుల ప్రాధాన్య సంఖ్యయే. కానీ ఇటీవల 10 అదృష్ట సంఖ్యగా మారింది.
 
ఇలా 
జ్ఞానానికి -  ఆజ్ఞానానికి,
నైతికతకు-విచ్చలవిడితనానికి 
వెలుగుకు       -  చీకటికి
అభివృద్దికి     -  నాశనానికి
మానవీయతకు- అమానవీయతకు  జరిగిన ఘర్షణలో బ్రాహ్మణిజం మూఢవిశ్వాసాలను ప్రతీ కర్మకాండలోనూ ప్రజల పైన రుద్దుతోంది. అజ్ఞానికి లోనైన జనాలు తమ జీవితాలను నీతిబాహ్యమైనవిగా చేసుకుని పూజలకూ,క్రతువులకూ,గుడులకూ,గోపురాలకూ ఆర్పణ చేసుకుంటూ తరిస్తున్నారు.

      అందుకే  *“భారతదేశం బౌద్ధాన్ని ఈ దేశాన్నుండి తరిమేసి ఆత్మహత్య చేసుకున్నది”* అంటారు మహాకవి గురజాడ. 
నమో బుద్ధాయ.
జైభీమ్
*ప్రసాద్ నూకతోటి*
కందుకూరు.9849868159

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు