బౌద్ధంలో విశిష్టమైన లక్షణం
బౌద్ధంలో విశిష్టమైన లక్షణం " ఎవ్వరో చెప్పినారని గ్రుడ్డిగా నమ్మకుండా తనంత తాముగా సత్యాన్నితెలుసుకోమని చెప్పడం" బుద్ధుడు 'నీకెవరో చెప్పినారని నమ్మకు, నీ గురువు చెప్పినాడని నీ గురువుపై ఉన్న
గౌరవం కారణంగా నమ్మవద్దు. అయితే నీ పరిశీలన, విశ్లేషనతో దానిని పది మందికి ఉపయోగపడతుంటే అప్పుడు దానిని స్వీకరించు. నీకు దారి చూపే మార్గంగా భావించు" అంటూ స్వీయ సాధనకు పెద్దపీట వేసాడు.
అలాగే పురాణాల్లో, మత గ్రంథాల్లోనూ రాశారని గ్రుడ్డిగా నమ్మవద్దని కూడా చెప్పినాడు. పూర్వీకులు చెప్పినారని,గురువులు చెప్పినారని నమ్మవద్దు. స్వీయపరిశీనలతో, విశ్లేషణతో అవి సమ్మతమనిపిస్తే, వాటిని స్వీకరించవచ్చని,
ఆచరించవచ్చని చెప్పినాడు. కాని నేడు సమాజంలో సంప్రదాయవాదులే ఎక్కువ.వీరు మారరు.ఇతరులను మారనివ్వరు. సమాజం మారాలంటే బౌద్ధధర్మాలుపాటించేవారు పెరగాలి. అంటే బౌద్ధం విస్తారం కావాలన్నమాట.
మనిషి ధర్మపరివర్తన చెందటానికి కోపాన్ని నిగ్రహించుకోవటం ఒక పార్శ్వమైతే, అసూయను
పరిహరించుకోవటం రెండో పార్శ్వం. ఇతరులను చూసి అసూయ చెందువాడు ప్రశాంతంగా ఉండలేదు. అసూయ మనిషిని దహించివేస్తుంది. అసూయను మించిన నేరం ఏదీ లేదన్నాడు బుద్ధుడు.
సుఖదు:ఖాలనేవి మన మనస్సులో ఏర్పడే భావాలని బుద్ధుడు స్పష్టం చేశాడు. తూర్పు, పడమరల ద్వారా కష్టసుఖాలు నిర్ణయించబడతాయనుకోవడం పూర్తిగా తప్పన్నాడు. మనస్సులో ఏర్పడిన సుఖదు:ఖాలను నియంత్రించుకోవాలేగాని ఏవో బయటి శక్తులకు వాటిని ఆపాదించడం, వాటి నుండి రక్షింపబడాలనుకోవడంమూర్ఖత్వ మన్నాడు. ఇప్పటికీ సమాజంలో చాలా మంది తన గ్రహస్థితులవల్ల, ఏవో క్షుద్రశక్తులవల్ల తమ
పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ అంటుంటారు. ఇది సరియైనది కాదని బుద్ధుడు తేటతెల్లం చేశాడు.
మనిషి ఆలోచనలకు, భావాలకు మనస్సే మూలమైంది. ఎద్దు వెంబడి చక్రాలు ఎలా వస్తాయో, మన మనస్సులో ఏవిచల్లుకుంటే అవే మనల్ని వెంటపడి వస్తాయని బుద్ధుడు చెప్పినాడు. నీ మనస్సును మంచి భావాలతో నింపుకుంటే నీ మాటలు, చేష్టలతో మంచి పొంగి పొరలి ఆనందం ఎల్లప్పుడూ నీడలా అంటిపెట్టుకొని ఉంటుందని బుద్ధుడు నొక్కి
వక్కాణించాడు.
మనసనేది ఒక పూలతోటలాంటిదన్నారు. అందులో ప్రేమ, ద్వేషం, భయం, తిరస్కారం, సహృదయత అనే విత్తనాలు పెరుగుతాయి. మరి, ఆ పూదోటలో ఎలాంటి విత్తనాలు చల్లాలనుకున్నావో తెలుసుకోమన్నాడా మహానుభావుడు.
తోటి మనిషిని ప్రేమించడం ద్వారా కోపాన్ని తగ్గించుకోవచ్చు. ప్రేమ, కరుణ, మైత్రి గుణాలను
పెంపొందించుకున్న మనిషి తప్పకుండా మనిషి అవుతాడు. ప్రేమను గురించి బుద్ధుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటే నేడు సమాజంలో యువతీయువకులు సరైన ప్రేమను గుర్తించగలుగుతారు.
నీకొక పుష్పం నచ్చినప్పుడుదానిని పీకితే దానిని ఇష్టపడినట్లు. అదే ఆ పూల చెట్టును శ్రద్ధగా నీళ్ళుపోసి పెంచితే ఆ పువ్వును ప్రేమించినట్లు, అదే ప్రేమకు, ఇష్టానికి గల తేడా అని ప్రేమకు గొప్ప నిర్వచనాన్ని ఇచ్చాడు బుద్ధుడు. ప్రేమికుల రోజు పేరిట జరిగే కార్యక్రమాన్ని నిజమైన ప్రేమలను ప్రతిబింబించడం లేదు. కారణం తోటి మనుషుల పట్ల ప్రేమానురాగాలు చూపించక కేవలం తన ఇష్టసఖిపట్ల ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారంతే.
Comments
Post a Comment