అశోకుడు ప్రచారం చేసిన ధమ్మగుణాలు :
అశోకుడు ప్రచారం చేసిన ధమ్మగుణాలు :
1. ప్రతివ్యక్తి తల్లి దండ్రులపట్ల విధేయత , బంధు మిత్రుల పట్ల అప్యాయత , నౌఖర్లు బానిసలపట్ల సౌజన్యత , శ్రమణులు(భిక్షువులు) పట్ల ఔదార్యం , మహిళలపట్ల గౌరవభావం కల్గియుండాలి .
2. విద్యార్థులు గురువులను గౌరవించాలి ..
3. చిన్న పెద్ద అన్ని ప్రాణుల పట్ల దయకలిగి యుండాలి. ఏ ప్రాణికి ఏ విధమైన హాని చేయకూడదు .
4. పవిత్రమైన శీలం , పటిష్టమైన మనోనిగ్రహం , పరిశుద్ధమైన ఆలోచన , హార్ధికమైన కృతజ్ఞతాభావం , శ్రద్ధాపూర్వక విశ్వాసం మొదలగు సద్గుణాలను అలవర్చుకొని ఆదర్శంగా జీవించాలి .
5. ఖర్చుచేయుటలో పొదుపును పాటించాలి .
6. అహంకారము , ద్వేషభావము మొదలగు దుర్గుణాలకు బదులు నిరాడంబరత , ఉదారత , సౌజన్యతలను అలవర్చుకోవాలి .
7. జననం , అనారోగ్యం , పరిణయం , ప్రయాణం వంటి సందర్భాలలో స్త్రీలు అనుసరించే మూఢాచారాలకు బదులు మంగళసుత్తను పఠించాలి.
8. పరిశుద్ధమైన , శ్రేష్టమైన మనస్సు కల్గి యుండాలి
9. ఎట్టి పరిస్థితులలోను జీవితాన్ని ఛిద్రం చేసుకోరాదు .
ఈ విధంగా అశోకుడు ప్రజలకు ధమ్మాచరణ పరంగా సరియైన దృష్టిని , దృక్పధాన్ని , సమున్నత విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేసాడు .
SOURCE BHOUDHA DHAMMA VISISTATHA
Comments
Post a Comment