చికాగో ప్రపంచ సర్వమత సమ్మేళనం లో అనగారిక ధర్మపాలుడు





  1893 Sept.11 లో  అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన  ప్రపంచ సర్వమత సమ్మేళనం లో మనదేశం నుండీ పోయిపాల్గొన్నది ఒక్క స్వామీ వివేకానందుడొక్కడేనని ప్రచారం జరిగింది , కానీ మరొక శ్రేష్టవ్యక్తి ఉన్నాడన్న విషయం మరుగున పడింది. ఆ పేరు ప్రచారములోనికి రాలేదు !
ఆయన పేరు " అనగారిక ధర్మపాలుడు ""
ఆయన భారతదేశంలో మహా భోది సొసైటీ స్థిరపడడానికి విశేష కృషి సల్పినవాడు.
శ్రీలంక వాసి అయినా భారతదేశంలో స్థిరపడి బౌధ్ధధర్మపునరుజ్జీవనానికి అనేకవిధాల పాటుపడినవాడు !
భారత దేశంతోసహా తూర్పు ఆశియాదేశాలలో విస్తృతంగా వ్యాపించిన బౌధ్ధ ధర్మం / బౌధ్ధమతం ప్రాభవాన్ని ప్రపంచ మతాల సమ్మేళనం 1893 లో  ప్రపంచ దేశాలకు తెలియజెప్పలన్న ప్రయత్నంతో పాల్గొన్నాడు.
ఆయన ఆ సమ్మేళనంలో
1. Man's mission on Earth.
2. The world's  debt  the Buddha, 
అను అంశాలపై 1893, Sept,11 నాడు శ్రీ అనాగరిక ధర్మపాలుడు ప్రపంచ సర్వ మత  సమ్మేళనంలో గంభీరోపన్యాసాలిచ్చి ప్రపంచానికి ముఖ్యంగా  పాశ్చాత్య ప్రపంచానికి బుధ్ధ భగవానుని జీవితం గురించీ ,మరియు ఆతన ధర్మప్రభోదనల గురించీ విశదీకరించాడు!
(ఆధారం - 15-2-1994 నాటి జనశక్తి పత్రిక నుండి సేకరించ బడింది)

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు