అశోక విజయ దశమి
అశోక విజయ దశమి
క్రీ. పూ. 261 కళింగ యుద్ధం జరిగిన తరువాత 1.5 లక్షల మంది మరణించారు 2 లక్షల మంది క్షతగాత్రులు అయ్యారు, 1 లక్ష మంది యుద్ధ ఖైదీలు గా పట్టుబడ్డారు ఎటుచూసినా హహకారాలు... అత్యంత దయనీయంగా మారిన బ్రతుకులు, కొడుకుని పోగొట్టుకున్న తల్లి
భర్తను కోల్పోయిన నవ వధువు
తండ్రిని కోల్పోయిన బిడ్డలు
కనీవినీ ఎరుగని నరమేధం, ఇది చూసి చలించి పోయిన సామ్రాట్ అశోకుడు, మొగ్గలి పుట్టతిస్స నుంచి ఉపశమనం పొంది బౌద్ధ స్వీకరణ కోసం నిశ్చయించాడు,
ఇది కళింగ యుద్ధం విజయం కాదని ఇది ధమ్మా విజయం అని ప్రకటించాడు సామ్రాట్ అశోకుడు, ఈ ఉత్సవాలు 10 రోజులు జరగాలని ఆదేశించాడు, ఈ పది రోజులు బుద్ధుడు చెప్పిన దశ పారమితులు అనుగుణం గా కార్యక్రమాలు రూపొందించారు, కనీవినీ ఎరుగనివి, ఎవ్వరు ఊహించనివి
మనవీయతకు, ధమ్మనికి అనుగుణం గా రూపొందించినవి ఆ కార్యక్రమాలు, అశ్విజ శుద్ధ పాడ్యమి నుండి మొదలు దశమి వరకు ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి
1. యుద్ధ ఖైదీలని విడిచి పెట్టడడం వారికి కమతాలు ఇవ్వడం రాజా పత్రం తో
2. మరణ శిక్షను రద్దు చేయడం
3. రైతులకు రుణాలు మాఫీ చేయడం
4. మేలు రకాలు అయిన ఎద్దులని ఎన్నుకొని వాటిని రైతులకు సరఫరా చేయడం
5. చిన్న వ్యాపారులకు రుణాలను ఇవ్వడం
6. కాలువలు , బావులు తవ్వించడం
7. చెట్లు నాటించడం, దేశం అంతటా మనకు మనకు పెద్ద పెద్ద వనలు అభివృద్ధి చేయటం, వాటినే అశోక వానలు గా ఇప్పుడు మనకు తెలుసు
8. ఈ రోజున అశ్విజ శుద్ధ అష్టమి రోజున అశోకుడు భౌద్ధ ధమ్మన్ని స్వీకరించాడు
9. జంతు బలిని నిషేదించాడు
10. యుద్ధం రద్దు అని ప్రకటించి తాను కత్తి పట్టుకొను అని ప్రకటించాడు
మానవియతకు అద్దం పట్టే ధమ్మా విజయాన్ని తరువాత అశోక విజయ దశమి గా తరువాత పురాణాల ను జొప్పించి ఒక మానవీయ పండుగను చంపే పండుగగా చిత్రీకరిస్తున్నారు,
Comments
Post a Comment