ఇక్షాకుల కాలంలో శ్రీ పర్వత ప్రాంతములో దేవాలయాల నిర్మాణం ప్రారంభమయింది. బౌద్ధుల స్థలాలను బ్రాహ్మణులు ఆక్రమించి బౌద్ధ నిర్మాణాలను తొలగించి దేవాలయాలను నిర్మించారు. ఇక్ష్వాకుల తరువాత అధికారంలోకి వచ్చిన పల్లవులు బౌద్ధ నిర్మాణలను ధ్వంసం చేసి రాజ్యమంతటా అనేక దేవాలయాలను నిర్మించారు.
విష్ణుకుండినులు ధాన్య కటకంలోని బౌద్ధస్తూపాన్ని ధ్వంసం చేసి ఆ శిబిరాల మీద అమరలింగేశ్వరాలయాన్ని నిర్మించారు. శ్రీశైలంలోని బౌద్ధకేంద్రాన్ని బ్రాహ్మణులు ఆక్రమించుకొని మల్లిఖార్జున దేవాలయాన్ని నిర్మించారు. కాశ్మీరులో బౌద్ధ విహారాన్ని ధ్వంసం చేసి ఆ శిభిరాల మీద అమరలింగేశ్వరాలయాన్ని నిర్మించారు. శ్రీశైలంలోని బౌద్ధ కేంద్రాన్ని బ్రాహ్మణులు ఆక్రమించుకొని మల్లిఖార్జున దేవాలయాన్ని నిర్మించారు. కాశ్మీరులో బౌద్ధ విహారాన్ని ధ్వంసం చేసి దానిపైన మార్తాండీ పేరుతో సూర్య దేవాలయాన్ని నిర్మించారు. ఎల్లోరాలో బౌద్ధ విహారాలను ధ్వంసం చేసి వాటిమీద విష్ణువు యొక్క దశావతారాలను ప్రతిష్టించారు. గ్వాలియార్ బౌద్ధ క్షేత్ర స్థలంలో తైల దేవుడి ఆలయాని నిర్మించారు. మధురలోని బౌద్ధ విహారలో నివసించే భిక్షువులను వెళ్ళగాట్టి. స్థలంలో దేవాలయాన్ని నిర్మించారు. గోరఖ్ పూర్లోని గోహమభేర్ అనే బౌద్ధక్షేత్రం బ్రాహ్మణుల ఆక్రమణకు గురి అయింది. అయిపాలాలు వద్ద గల బౌద్ధ చైత్యాన్ని కూల్చి మొదటి చాళుక్యులు దుర్గాదేవి ఆలయాన్ని నిర్మించారు. గుజరాత్ బౌద్ధుల నివాస స్థలాలపైన విమల దేవాలయాన్ని నిర్మించారు. చాళుక్యుల కాలంలో బౌద్ధస్తూపాలను ధ్వంసం చేసి వాటిపై శైవ మతానికి చెందిన పంచారామ దేవాలయాలను నిర్మించారు. చోళసైన్యాధ్యక్షుడైన తిరుమంగై అనే వైష్ణవ ఆళ్వార్ నాగపట్నంలోని బంగారుబుద్ధ విగ్రహాన్ని తొలగించి బంగారంతో శ్రీరంగంలోని రంగనాధ దేవాలయ గోపురానికి బంగారు పూత పూయించాడు. ఉండవల్లి వద్దగల బౌద్ధ విహారాన్ని పడగొట్టి అనంతశయన దేవాలయాన్ని నిర్మించారు. పురావస్తుశాఖ సంచాలకుడైన ఎ.కన్నింగ్హాం త్రవ్వకాల ద్వారా పరిశోధను జరిపి బౌద్ధుల చైత్యాలను, ఆరామాలను ధ్వంసం చేసి వాటిపైన దేవాలయ నిర్మాణం జరిగినట్లు పేర్కొన్నాడు. పెర్సీ బ్రౌన్ అనే పరిశోధకుడు మధురలోని బౌద్ధ చైత్యానికి చెందిన స్థలంలోనే మీనాక్షి దేవాలయాన్ని నిర్మించారు అని పేర్కొన్నాడు. బ్రాహ్మణులు దౌర్జన్యంతో బౌద్ధులను అణచివేయటం వలన వారు బుద్ధగయను విడచి వెళ్ళాల్సి వచ్చింది. ఆ తరువాత బ్రాహ్మణులు బౌద్ధక్షేత్రాన్ని ఆక్రమించుకొని దాన్నిశైవ క్షేత్రంగా చూర్చిచేసారు. అనగారిక ధర్మపాల అనే బౌద్ధ భిక్షువు దీర్ఘకాలం న్యాయపోరాట ఫలితంగా బుద్ధగయ తిరిగి బౌద్ధుల ఆధీనంలోకి వచ్చింది.
(భారతదేశంలో బౌద్ధ నిర్మూలన గ్రంథం) అనువాదం: డా.గుమ్మా వీరన్న._ హేతువాది,మే,2021.
Comments
Post a Comment