ఆనాపాన సాధన: ANAPANA


           pc: pinterest
ముందుగా సుఖంగా వుండేటట్లు కూర్చోవాలి.
మామూలుగానైతే దిండు మీద కాళ్ళు మడచి బాసుమట్టం వేసుకొని కూర్చొంటాం.
కానీ ఇలా కూర్చోవటం కష్టంగా వున్నవాళ్ళు కుర్చీపై కూర్చోవచ్చు.
వీపును, మెడను వెనుకకు ఆనించ కూడదు. అలా ఆనిస్తే నిద్రమత్తు కలుగుతుంది.
కొంతసేపు ధ్యానం చేసిన తరువాత అప్పుడప్పుడు దేనికైనా ఆనుకొని కొంచెం సేపు కూర్చోవచ్చు.
అలాగే కాళ్ళు కూడా జాపుకోవచ్చు.
అలా కొంచెం సేపు సేదతీర్చుకున్న తరువాత మళ్ళీ మొదట కూర్చొన్నట్లే కూర్చొని సాధన సాగించాలి. 
కళ్ళు మూసుకొని వుండాలి.

మీ ధ్యాసను ముక్కు క్రిందా పైపెదవి పైన మధ్య భాగం మీద ఎక్కడ లోపలికి వెళ్ళే గాలి, బయటకు వెళ్ళే గాలి తాకుతూ వుంటుందో ఆ బిందువు వద్ద కేంద్రీకరించాలి.

ఇక్కడ మూడింటిని గమనిస్తూ సాధన చేయాలి.
1. గాలి లోనికి వస్తున్నప్పుడు గాలి లోనికి వస్తున్నది అని తెలుసుకోవాలి.
2. గాలి బయటకు పోతున్నప్పుడు, గాలి బయటకు పోతున్నది అని తెలుసుకోవాలి.
3. ముక్కు క్రింద, పై పెదవి మధ్య భాగం మీద గాలి ఎక్కడ తాకుతుందో ఆ బిందువును తెలుసుకోవాలి. గాలి తాకిడి వల్ల అక్కడ కలిగే సంవేదనను తెలుసుకుంటూ సాధన చేయాలి.
గాలి తాకుతుండే బిందువు స్ధానం, ఆ స్ధానం పైన కలిగే అనుభవ తీవ్రతా ఒక్కొక్కప్పుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వుండవచ్చు.

గాలి తాకుతున్న స్ధానం తెలియనప్పుడు, మీ ధ్యాసను ముక్కు క్రింద పై పెదవి పైన మధ్య భాగం మీద వుంచాలి.

జలుబు చేసి గాని, మరే కారణం వల్లనైనా గాని ముక్కుతో గాలి పీల్చుకో లేనప్పుడు, మీ ధ్యాసను ముక్కు క్రింద పై పెదవి పైన మధ్య భాగం మీద వుంచాలి.

ఎప్పుడైనా శ్వాస పట్ల ఎరుక, శ్వాస స్పర్శ పట్ల ఎరుక లేనప్పుడు, మీ ధ్యాస పై పెదవి పైన మధ్య భాగం మీద నిలువనప్పుడు, ఉద్దేశ పూర్వకంగా కొద్దిసేపు గట్టి శ్వాస పై పనిచేయవచ్చు. 

తిరిగి మీ ధ్యాస పై పెదవి పైన మధ్య భాగం మీద నిలబడినప్పుడు, మరల మామూలు సహజమైన, స్వాభావిక మైన శ్వాస పై పనిచేయాలి.

మనస్సు ఎక్కడెక్కడికో పోతుందని తెలుసుకున్నప్పుడు, తిరిగి దాన్ని ధ్యాన ఆలంబన పైకి తీసుకురావాలి. 
ఎన్ని సార్లు ఇలా జరిగినా సరే, మనసును తిరిగి ధ్యాన ఆలంబన పైకి తీసుకురావాలి.
ఎటువంటి చికాకు, నిరాశ లేకుండా చూసుకోవాలి.
మనస్సు అత్యంత చంచలమైనదనీ, అదుపు చేయటం కష్టమనీ, బుద్ధ భగవానుడే చెప్పాడు. 
కాబట్టి ప్రయత్నం చేస్తూ వుండాలి.

ఆనాపాన అభ్యాసం – సూచనలు [Anapana Instructions]

1. సుఖంగా విశ్రాంతిగా కూర్చోండి.
2. వీపు, మెడ తిన్నగా, విశ్రాంతిగా వుంచండి.
3. కళ్ళను సున్నితంగా మూసి వుంచండి.

ఇప్పుడు మీ ధ్యాస నంతా   ముక్కుకింద పైపెదవి పైనున్న మధ్య భాగంలో ఉంచండి. 

శ్వాస లోనికి రావడం, బయటికి  వెళ్ళడం ఎరుకతో గమనిస్తూ ఉండండి. 

పీల్చుకుంటున్నప్పుడు, వదలినప్పుడు  పైపెదవి పై భాగాన శ్వాస  ఎక్కడ తాకుతుందో శ్రద్ధగా గమనిస్తూ ఉండండి. 

అప్పుడప్పుడు శ్వాసను ఉద్దేశ పూర్వకంగా గట్టిగా పీల్చుతూ నిలకడగా  ఉండండి. 

కొంత సమయానికి మనసు కుదుటపడినప్పుడు మామూలు స్వాభావిక శ్వాసపై పని చేయండి. 

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు