పుష్పగిరి ఒక బౌద్ధ క్షేత్రం


పుష్పగిరి ఒక బౌద్ధ క్షేత్రం

చెయ్యేరు ఒడ్డున వున్న నందలూరు మాత్రమే కాక, పెన్నా నదీతీరాన పుష్పగిరి లోనూ, కుందూ చెంతనవున్న పెద్దముడియంలోనూ, ఖాజీపేట మండలంలోని కొండపైన నేలమాళిగలోనూ బౌద్ధ సంబంధ  విశేషాలున్నాయి. రాజంపేట మండలంలోని తాళ్ళపాకలోని పాటిగడ్డలో కూడా బౌద్ధ ప్రాభవ అంశాలున్నాయి.

రుద్రమదేవికి సామంతునిగా అంబదేవుడు ఉండేవాడు.అతను  అప్పట్లో వల్లభాపురం పాలించేవాడు.అదే నేటి వల్లూరు మండలంలోని ఆదినిమ్మాయపల్లి పంచాయతీ లోని   పుష్పగిరి. అక్కడ కనిష్కుని కాలం  సాధారణ శకం 1వ శతాబ్ది నాటి బౌద్ధ స్థూపం వెలుగులోకి వచ్చింది. ఇది ఐదు కోణాలతో పంచాకృతిలో, నక్షత్రాకరంలోని వేదికపై నిర్మించబడింది. ఈ ఐదు కోణాలు  ‘పంచశీల’కు ప్రతీకలు. ఇలా కోణాకృతిలో నిర్మించబడిన నిర్మాణాలు కాలగమనాన్ని గణించే సాధనాలుగా ఉపయోగపడివుంటాయి. నెలలను, చంద్ర గమనాన్ని లెక్కించే సాధనాలను ఆనాటి బౌద్ధ పండితులు రూపొందించేవారు. బౌద్ధుల కాలమాన గణన ఘనమైనది, ప్రశంసనీయమైనది. బౌద్ధుల విశిష్టత  వైజ్ఞానికతతో ముడిపడి ఉంది. ఈ విజ్ఞాన విస్తృతికి ఈ కాలమాన గణన సాధన సంపత్తికి పెన్నేరు సాక్షిగా నిలిచిఉంది.


Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు