పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నేలమాళిగలోని
కుందూ-పెన్నా నదుల మధ్య అనేక బౌద్ధారామాలతో పాటు.. పుష్పగిరి కొండలు, పెద్దముడియం, ఖాజీపేటలోని ఓ కొండపైన ఉన్న నేలమాళిగలోని బౌద్ధ అవశేషాలు ఉన్నాయి. శాతవాహనుల కాలంలో ఇక్కడి కొండలు, గుట్టలు బుద్ధుడి త్రిశరణాలు, పంచశీల, బిక్షవుల పఠనతో ప్రతిధ్వనించాయని చరిత్రకారులు చెబుతున్నారు.

రాజంపేట మండలం అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాకలోని పాటిగడ్డలోనూ బౌద్ధ ప్రాభవాలు ఉన్నాయి. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కల్గిన నందలూరు బౌద్ధారామాల్లో.. 15 స్థూపాలు ఉన్నట్లు గుర్తించారు. 1906లో పురావస్తుశాఖ తవ్వకాల్లో జమ్మలమడుగు - పెద్దముడియం వద్ద క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపం బయటపడింది. 

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు