సంప్రదాయ పద్ధతిలో ధర్మాన్ని నేర్పడం

నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స
నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స
నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స

ధర్మాన్ని సంప్రదాయ పద్దతిలో నేర్చుకుంటారు.
మొదటగా (1) త్రిరత్న శరణు
రెండవది (2) పంచశీలాలను లేదా అష్ట శీలాలను స్వీకరించడం
మూడవది (3) బుద్ధుని మరియు ఆచార్యుని సూచనలకు సమర్పించుకోవటం
నాలుగవది (4) సాధన నేర్పమని ఆచార్యుని వేడుకొనుట లేదా యాచించాలి

ఇప్పుడు నేను చెప్పిన మాటలను తిరిగి మీరు అనాలి.
(I)
త్రిరత్న శరణు
బుద్ధం శరణం గచ్ఛామి
ధమ్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి

దుతియమ్పి బుద్ధం శరణం గచ్ఛామి
దుతియమ్పి ధమ్మం శరణం గచ్ఛామి
దుతియమ్పి సంఘం శరణం గచ్ఛామి

తతియమ్పి బుద్ధం శరణం గచ్ఛామి
తతియమ్పి ధమ్మం శరణం గచ్ఛామి
తతియమ్పి సంఘం శరణం గచ్ఛామి.
(II)
పంచ శీల
1. 'ప్రాణహింస చేయకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
2. 'దొంగతనము చేయకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
3. 'వ్యభిచారము మొదలగు దురాచారాలను చేయకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
4. 'అసత్యం పలుకరాదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
5. 'సారాయి, గంజాయి మొదలైన మత్తు పదార్ధాలను సేవించకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.

పంచ శీల, పాలీభాషలో
1. పాణాతి పాతా వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
2. అదిన్నాదానా వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
3. కామేసు, మిచ్ఛాచారా వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
4. ముసావాద వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
5. సురా, మేరయ, మజ్జ, పమాదట్ఠాన వేరమణి సిక్ఖాపదం సమాదియామి.

అష్టశీల
1. 'ప్రాణహింస చేయకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
2. 'దొంగతనము చేయకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
3. 'అబ్రహ్మచర్యాన్ని చేయకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
4. 'అసత్యం పలుకరాదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
5. 'సారాయి, గంజాయి మొదలైన మత్తు పదార్ధాలను సేవించకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
6. 'అకాల భోజనం (మధ్యహ్నం తరువాత భోజనం) చేయకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
7. 'నాట్యము, గానము, సంగీతము, అసభ్యకరమైన ఆటలు, పాటలు, తమాషాలు మొదలైన వినోద కార్యక్రమాలలో పాల్గొనకూడదు' అనే నియామాన్ని, 'పూలమాలలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన అలంకరణ వస్తువులను వాడకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.
8. 'ఎత్తైన విలాసవంతమైన పడకలను వాడకూడదు' అనే నియమాన్ని స్వీకరిస్తున్నాను.

అష్టశీల, పాలీభాషలో
1. పాణాతి పాతా వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
2. అదిన్నాదానా వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
3. అబ్రహ్మచరియా వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
4. ముసావాద వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
5. సురా, మేరయ, మజ్జ, పమాదట్ఠాన వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
6. వికాల భోజన వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
7. నచ్చ, గీత, వాదిత, విసూకదస్సనా, మాలా, గంధ, విలేపన, ధారణ, మణ్డన, విభూసనట్ఠానా వేరమణి సిక్ఖాపదం సమాదియామి.
8. ఉచ్ఛసయన, మహాసయన వేరమణి సిక్ఖాపదం సమాదియామి.

(III)
మూడవది (3) బుద్ధుని మరియు ఆచార్యుని సూచనలకు సమర్పించుకోవటం
"నేను నా వ్యక్తిత్వాన్ని పూజనీయుడైన బుద్ధునికి సమర్పించుకుంటున్నాను."
"నేను నా వ్యక్తిత్వాన్నిఆచార్యునికి సమర్పించుకుంటున్నాను."

పాలీభాషలో
"ఇమాహం భంతే అత్తాభావం జీవితం భగవతో పరిచ్చాజామి."
"ఇమాహం భంతే అత్తాభావం జీవితం ఆచారియస పరిచ్చాజామి."

(IV)
నాలుగవది (4) సాధన నేర్పమని ఆచార్యుని వేడుకొనుట లేదా యాచించాలి
ఆనాపాన
"ఓ భంతే! నేను నా అంతరంగంలో నిర్వాణ శాంతి అనుభవం కోసం మిమ్ములను ఆనాపాన అభ్యాసం నేర్పమని కోరుతున్నాను."

పాలీభాషలో
"నిబ్బానస్స సచ్చి, కరనత్ధాయ మే భంతే, అనాపాన కమ్మట్ఠానం దేహి".

విపశ్యన
"ఓ భంతే! నేను నా అంతరంగంలో నిర్వాణ శాంతి అనుభవం కోసం మిమ్ములను విపశ్యనా అభ్యాసం నేర్పమని కోరుతున్నాను."

పాలీభాషలో
“నిబ్బానస్స సచ్చి, కరనత్ధాయ మే భంతే, విపస్సనా కమ్మట్ఠానం దేహి”.

Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు