బుద్ధ వచనం


     pc: Pranjaliprabha
ఎప్పుడైనా శీలవంతులైన వారు  ఒక ఇంటికి వచ్చినప్పుడు, ఆ ఇంటి వారు ఐదు కారణాలతో ఎంతో పుణ్యం గడిస్తారు. ఏమిటా ఐదు ?


(1) శీలవంతులైన వారు తమ గృహానికి రావడాన్ని చూసినప్పుడు, వారి హృదయాలు ప్రకాశవంతమైనప్పుడు . 

(2) తమ ఇంటికి వచ్చిన వారికి గృహస్థులు లేచి నిలబడి శ్రద్ధాంజలి ఘటించి , కూర్చొనడానికి ఆసనాలు ఇచ్చినప్పుడు

 (3) తమ కుటుంబాలకు శీలవంతులైన వారు వచ్చినప్పుడు తమ లోభితనం మరకను తొలగించినప్పుడు

4)తమ ఇండ్లకు వచ్చిన శీలవంతులైన వారికి, గృహస్థులు అతని సామర్థ్యానికి అనుగుణంగా, వారి బలానికి అనుగుణంగా తమకు ఉన్న దాంట్లో  పంచుకున్నప్పుడు. 

(5) తమ ఇండ్లకు వచ్చిన శీలవంతులైన వారినుంచి కుటుంబీకులు వారి బోధలను ప్రశ్నించి, విచారణ చేసినప్పుడు ఇంక ఇతర ధర్మాన్ని విన్నప్పుడు.

(అంగుత్తరనికాయం,5.199)

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు