బౌద్ధం గురించి కొంత


త్రిశరణములు

బుద్ధం శరణం గచ్ఛామి (బుద్ధుని శరణు వేడుచున్నాము)

ధమ్మం సరణం గచ్చామి (బుద్ధ ధర్మాన్ని శరణు వేడుచున్నాము)

సంఘం సరణం గచ్చామి(బుద్ధ సంఘాన్ని శరణు వేడుచున్నాము)

చాతురార్య సత్యములు

1.దు:ఖం

2. దు:ఖ కారణం

3.దుఃఖ నివారణ

4. దుఃఖ నివారణ మార్గం

 అష్టాంగ మార్గం

సమ్యక్ వాక్కు- సరైన మాట  
సమ్యక్ కర్మానం -సరైన ఆచరణ
సమ్యక్ ఆజీవ - సరైన జీవనోపాధి
సమ్యక్ వ్యాయామం - సరైన కృషి 
సమ్యక్ స్మృతి - సరైన జాగరూకత                సమ్యక్ సమాధి-సరైన ఏకాగ్రత  
సమ్యక్ దృష్టి - సరైన అవగాహన
సమ్యక్ సంకల్పం - సరైన సంకల్పం


పంచశీల


పాణాతిపాతా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి

ప్రాణములు తీయను అను నియమాన్ని పాటిస్తాను 

అదిన్నాదానావేరమణి సిక్ఖాపదం సమాది
యామి 
చౌర్యానికి పాల్పడను అనే నియమాన్ని పాటిస్తాను

కామేను మిచ్చాచారా వేరమణి సిక్ఖాపదం  సమాదియామ
 లైంగిక దురాచారాలకు పాల్పడను అనే నియమాన్ని పాటిస్తాను

ముసావాదావేరమణి  సిక్ఖాపదం సమాదియామి

అబద్ధములు చెప్పకూడదు అనే నియమాన్ని పాటిస్తాను 

సురామేరయమజ్జపమాదట్టానా వేరమణీ సిక్ఖాపదం సమాదియామి 

మత్తు పదార్థములు, మత్తు పానీయములు త్రాగను అనే నియమాన్ని పాటిస్తాను

బ్రహ్మ విహారాలు

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష .

ప్రతీత్య సముత్పాద సిద్ధాంతం (కార్యకారణ సిద్ధాంతం) కారణం లేకుండా కార్యం జరుగదు. కార్యం జరిగినట్లయితే కారణం ఉంటుంది

త్రిపిటకములు

పిటకము అనగా పాళీ భాషలో గంప అని అర్థం బుద్ధుని బోధనలు ఒకరి చేతుల మండి వస్తువులతో నిండియన్న గంప మాదిరిగా
ఇంకొకరికి అందించునట్లు బుద్దుని భోధనలు చేరాలని భావన

సుత్త పిటకము - ఉపాసక, ఉపాసికలకు ఆసక్తికరంగా వుంటుంది 
వినయ పిటకము - భిక్షువుల మరియు భిక్షుణీల ప్రవర్తనా నియమావళి

3. అభిధమ్మ పిటకము - ఉన్నత దార్శనిక విషయాల చర్చ

తధాగతుడు

తాను ఆచరించిన దానిని ఇతరులకు బోధించేవాడు





Comments

Popular posts from this blog

Story of Punnika

మహాబోధి ఆలయం

త్రిపిటకాలు