బుద్ధుని బోధనలు


           Buddha
కుటుంబం:

1. ఒక కుటుంబంలో ఒకరి మనస్సు నొకరితో కలుస్తాయి. అవి ఒకదాని వెంట నొకటి ప్రేమతో వుంటే ఆ కుటుంబం ఒక నందనవనంలా వుంటుంది. అవే ఒకదాని నౌకటితో సమన్వయం లేకపోతే ఆ కుటుంబం తుఫాను భీభత్సానికి గురైన పూలవనంలా వుంటుంది.

తప్పులు :

1. నీ సోదరురని తప్పులు వెదకడం ఎంత సులువు. నీ తప్పులను గుర్తించడం ఎంత కష్టం. హృదయానందం,
అంతులేని సంతోషం ఇనేవి సాధించాలంటే మొదట దాన్ని త్యజించాలి. రెండవ దాన్ని అందుకోవాలి.
2. తప్పును తప్పుగానూ, ఒప్పును ఒప్పుగానూ చూడండి. నీ మనస్సులోపల పరికించి చూది, సహజంగా ఉండండి.

సోమరితనం :

1. సోమరిగా వుండటమంటే చావు దగ్గరగా వెతుక్కోవటమే. కష్టపడే విధానమే సరైన జీవనమార్గము. వివేకవంతులు
కష్టపడే మార్గాన్ని ఎన్నుకుంటే బుద్ధిహీనులు సోమరితనాన్ని ఎన్నుకుంటారు.

దాచి పెట్టలేనివి :

మూడు విషయాలను ఎట్టి పరిస్థితులలోనూ దాచిపెట్టలేవు, అవి సూర్యుడు, చంద్రుడు, సత్యం.

అర్ధమవడం :

1. ప్రతి ఒక్కరికి నేను సమానంగా ఉండలేను, కానీ ఎవరికో ఒకరికి ఏదో ఒకటిగా అర్థం అవుతాను,
2. మన వెనుక ముందర ఏమున్నాయనేవి, మనలోపల ఏ ముందనే దానితో పోలిస్తే చాలా చిన్నవి.

కార్యాకారణ సంబంధం :

1. కారణం లేకుండా కార్యం జరగదు. కార్యం జరిగినట్లయితే కారణం ఉంటుంది.

ధన్యవాదాలు :

1. మంచివారు తాము ఇతరుల నుంచి పొందిన వాటికి కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తారు. పెద్దవారు ఇతరుల సహాయం
తాము పొందినా ఎలాంటి భావాన్ని ప్రదర్శించరు.
2. ఈ రోజు అందరం ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుదాం. ఈ దినం ఎంతో నేర్చుకున్నాం కదా !
పోనీ ఏమీ నేర్చుకోకపోయినా కొంచెమన్నా తెలుసుకున్నాం కదా !
పోనీ మీకు తెలీకపోయినా కనీసం మనం అనారోగ్యానికి గురికాలేదు కదా !
పోనీ అనారోగ్యం గురికాకపోయినా కనీసం మనం మరణించలేదు కదా !
అందుకోసమైనా మనం ప్రకృతికి ధన్యవాదాలు తెలుపుదాం.

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు