నీకెవరో చెప్పినారని నువ్వు నమ్మకు_బుద్దుడు


1. మానవ జీవన ప్రస్థానంలో నమ్మకం అవసరమైనది, ప్రశస్థమైనది. అది లేకపోతే మన మనుగడ కష్టమే. అది గొప్ప సాంత్వన కలిగిస్తుంది.అది గొప్ప ఆస్తి.

2. ఆకాశంలో తూర్పు, పడమరలు లాంటివి ఏ దిక్కులూ లేవు. ప్రజలు తమ మనస్సుల్లో దిక్కులను సృష్టించుకొని అవే నిజమని నమ్ముతున్నారు.

3. నీకెవరో చెప్పినారని నువ్వు నమ్మకు. నీ గురువు చెప్పినాడని నీ గురువుపై వున్న గౌరవం కారణంగా నమ్మవద్దు. అయితే నీ పరిశీలన, విశ్లేషణతో దానిని పది మంది సంక్షేమానికి ఉపయోగపడుతుంటే అప్పుడు దానిని స్వీకరించు. నీకు దారిచూపే మార్గంగా భావించు.

4. నువ్వు చదివినావనో, ఎవరో చెప్పినారనో, నేను చెప్పినాననో నువ్వు నమ్మవద్దు. ఆ విషయం నీకున్న పరిజ్ఞానంతో,వివేచనతో, సృజనాత్మకతతో విశ్లేషించి నీకు సమ్మతమనిపిస్తే, దానిని స్వీకరించు.

5. పురాణాల్లోనో, మత గ్రంథాల్లోనో రాశారని గ్రుడ్డిగా నమ్మవద్దు. పూర్వీకులు చెప్పివారనో, గురువులు చెప్పినారనో నమ్మవద్దు. నీ పరిశీలన, విశ్లేషణతో అందరికీ ఉపయోగపడుతాయో వాటిని గుర్తించి అవి సమ్మతమనిపిస్తే వాటిని స్వీకరించు, ఆచరించు.

6. ఇతరులను అనుమానిస్తూ కూర్చోవడం చాలా భయంకరమైనది. ప్రజల నుంచి నిన్ను అది వేరు చేస్తుంది. మిత్రులను దూరం చేస్తుంది. అనుమానం విషంలాగా పనిచేస్తుంది. అది ఒక ముల్లులాగా గుర్చుకుంటూ నిన్ను బాధిస్తుంది. అది ఒక కత్తిలా నిన్ను చంపేస్తుంది.

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు