మన ఆలోచనలు _ బుద్ధుడు
1. మనమేం ఆలోచిస్తామో ఆ విధంగా మనం
తయారవుతాము.
2. నకారాత్మక (చెదు) ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. వాటిపట్ల జాగ్రత్త వహించాలి.
3. మన ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని
తయారుచేస్తున్నాం.
4. నీ ఆలోచనలను సరిగ్గా సంరక్షించుకోకపోతే అవి ఏ శత్రువు చేయనంత హాని చేస్తాయి. కాని ఒకసారి నీ ఆలోచనలపై అదుపు సాధించ గలిగితే నీకెలాంటి సహాయం అవసరంలేదు.చివరకు తల్లిదండ్రుల సహాయం కూడా.
5. మంచి ఆలోచనల్ని కాపీ కొట్టడం సమంజసం కాదు. కాని మంచి అనుభూతుల్ని కాపీ కొట్టడం చాలా మంచిది. పైగా అది నిన్ను అభివృద్ధిలోకి తీసుకు వెళుతుంది.
6. ఎంత మంచి విషయాలు చదివినా, ఎంత గొప్ప విషయాలు మాట్లాడినా, ఎంత మంచి ఆలోచనలు చేసినా వాటిని ఆచరించకపోతే ఏమి ప్రయోజనం ?
7. మనం మన ఆలోచనల ఫలితంగా తయారవు తాము. నిస్వార్థపు ఆలోచనలుగలవారి మాటలవల్ల లేదా చర్యలవల్ల ఆనందం లభిస్తుంది. ఆనందం వారిని నీడలా వెన్నంటి వుంటుంది. అది ఏనాడూ వదలిపోదు.
8. మన జీవితం మన ఆలోచనల ఫలితంగా ఏర్పడినదే. గడచిన కాలంలో నీ ఆలోచనల ఫలితమే వేదు మీరున్న పరిస్థితికి కారణం. నేటి ఆలోచనలే రేపటి భవిష్యత్ జీవితాన్ని నిర్ణయిస్తాయి.
9. ఒక ఆలోచన స్వర్గానికి దారితీస్తుంది. మరొక ఆలోచన నరకానికి దారితీయవచ్చు.
10. ఒక ఆలోచన ఆలోచనగానే వుండటం కన్నా దాన్ని ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యమైనది.
11. నీ ఆలోచనల కన్నా మించిన శత్రువు ఎవరూలేరు. ఆవిచేసే హాని శత్రువు కూడా చేయలేదు. నీ ఆలోచనలను నియంత్రించక పోతే నిన్నెవరూ రక్షించలేరు. నీ తల్లిదండ్రులు కూడా ఏమి చేయలేరు.
12. మనం ఈ రోజున్న పరిస్థితి మన ఆలోచనల ఫలితమే. ఒక మనిషి చెడు మాట్లాడినా , చెడు ఆలోచనలతోప్రవర్తించినా, బాధలు అతన్ని వెంటాడుతాయి. అదే విధంగా ఒక మనిషి మంచి మాట్లాడినా పరిపూర్ణ మనస్కుడై ప్రవర్తించినా సంతోషం అతన్ని నీడలా వుండి ఏనాడూ అతన్ని విడిచిపెట్టదు.
Comments
Post a Comment