వాక్కు ప్రాధాన్యతను వివరించిన బుద్ధుడు


             Pc 123rf.com

వాక్కు ప్రాధాన్యతను వివరించిన బుద్ధుడు

1. నువ్వు చేసే పని, నీ వాక్కు ఇతరులకు, నీకూ ఉపయోగపడుతున్నప్పుడు నీకు ఆనందం కలుగుతుంది.

2. కొన్ని వేల వ్యర్థపు మాటల కన్నా శాంతిని, కాంతిని కలుగజేసే మంచిమాట ఒక్కటే చాలు.

3. మొరిగే కుక్కను మంచి కుక్క అని ఎలా అవమో, వాగుడుకాయను సరైన మనిషిగా భావించరు.

4. నాలుక ఒక పదునైన చాకులాంటిది. అది రక్తం కారకుండా మనిషిని చంపేయగలదు.

5.పదాలకున్న శక్తి ఆ పరిమితం. మనిషిని నాశనం చేయగలవు. లేదా గాయాల్ని మాన్పగలవు, పదాలు దయాపూరితమై సత్యమైతే అవి ప్రపంచాన్ని మార్చగలవు.

6. మనం మాట్లాడే మాటలను, పదాలను జాగ్రత్తగా వాడాలి. ప్రజలు వాటిని వింటారు. ప్రభావితులవు తారు. వాళ్ళపై మంచి మాటలు మంచిగానూ, చెడు మాటలు చెడుగానూ ప్రభావితం చేస్తాయి.

ఇనుము విరిగినేని యినుమారు ముమ్మారు
కాల్చియతుకవచ్చు క్రమముగాను
మనసు విరిగెనేని మరికూర్చవచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ.

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు