ఆరోగ్యం పై బుద్ధుని ప్రవచనాలు



1. తన ఆరోగ్యానికి, అనారోగ్యానికి తానే రచయిత

2. ఆరోగ్యం గొప్ప వరం, సంతృప్తి గొప్ప సంపద, నమ్మకం అతి గొప్ప బంధం

3. నీ శరీరం ఎంతో విలువైనది. దివ్యత్వాన్ని సాధించడానికి శరీరమే సాధనం. దీనిని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి.

4. శరీరాన్ని ఆరోగ్యంగా వుంచుకోవడం తప్పనిసరి. లేకపోతే మన మనస్సును దృఢంగా, పరిశుభ్రంగా వుంచుకోవడం సాధ్యంకాదు.

5. శారీరక దారుఢ్యాన్ని నిరంతరంగా కాపాడు కోకుండా అంతర్గత ప్రశాంతతను సాధించలేవు.

6. గతాన్ని తలపోస్తూ, భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటూ కష్టాలు వస్తాయోమోనని భయ పడుతూ వుంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా వుండలేము. వర్తమాన కాలంలో ఆనందంగా, వివేకవంతంగా జీవిస్తూ వుంటే అన్ని రకాల ఆరోగ్యంగా జీవించవచ్చు.

7. నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా, కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలన్నా, అందరికి శాంతిని సాధించాలన్నా, మువ్వు నీ మనస్సుకు క్రమశిక్షణ నేర్పి మనస్సును నీ ఆధీనంలో ఉంచుకోవాలి. మనస్సును ఎవరు తన ఆధీనంలోకి తెచ్చుకుంటారో వారు సర్వజ్ఞానానికి దారిని కనుక్కోగలరు. వివేకం, మంచితనం, వారిని సహజంగా వెన్నంటి వస్తాయి.

Comments

Popular posts from this blog

బౌద్ధ సాహిత్యం

Story of Punnika

త్రిపిటకాలు