మనస్సు గురించి బుద్ధుని వచనాలు
మనస్సు గురించి బుద్ధుని వచనాలు
1. ఉత్సాహముంటే జ్ఞానం లభిస్తుంది. ఉత్సాహం లేకపోతే జ్ఞానం పోగొట్టుకుంటారు.
2. నీకు నిత్యం అపవాదులు, పొగడ్తలు ఎదురవుతూ వుంటాయి. కాని అవి నీ మనస్సును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకుండా చూసుకోవాలి.
3. చెడు పనులవైపు దృష్టి సారించేది నీ మనస్సు, నీ శత్రువు ఎంత మాత్రమూ కాదు.
4. క్రమశిక్షణ లేని మనస్సు అవిధేయతగా ఉన్నంతగా ఏది వుండదు. క్రమశిక్షణగల మనస్సు
విధేయతగా ఉంటుంది.
5. ఆపనమ్మకమైన చెడు తలంపులు కలిగిన మిత్రుని చూచి భయంకరమైన జంతువుకంటే ఎక్కువ భయపడాలి.
భయంకర జంతువు నీ శరీరానికి హానితల పెట్టవచ్చు. కాని చెడు తలంపులు గల మిత్రుడు నీ మనస్సును గాయపరుస్తాడు.
6. ఒక వ్యక్తి పరిపూర్ణ ఉదాత్త గుణంగల హృదయం గలవాడైతే అతని పరిసరాలన్నింటిని ఉదాత్తంగా మార్చి వేస్తాడు.
7. మనస్సే అన్నింటికి మూలం. నీ మనస్సులోకి బురదచల్లుకుంటే నీకు బాధలు వెన్నంటి వస్తాయి. ఎద్దు వెంబడి ఎలా చక్రాలు వస్తాయో అలా. నీ మనస్సును మంచి భావాలతో నింపుకుంటే నీ మాటలు, నీ చేష్టలలో మంచి పొంగిపొరలి ఆనందం ఎల్లప్పుడూ నీడలా నిన్ను ఆంటి పెట్టుకుంటాయి.
8. నీ గాయాల్ని, దుఃఖాన్ని ఎవరూ మాన్పలేరు. సువ్వు గనుక వాటిని మనస్ఫూర్తిగా, ఆర్తిగా హృదయంతో తాకితే అవి మానిపోతాయి. ఆత్మ శుద్ధికి నీవే, మకిలితనానికి నీవే కారణం.
8. మనస్సనేది ఒక పూల తోట లాంటిది. అందులో ప్రేమ, ద్వేషం, భయం, తిరస్కారం, సహృదయత అనే విత్తనాలు పెరుగుతాయి. మరి ఆ పూదోటలో ఎలాంటి విత్తనాలు చల్లాలనుకుంటున్నావు ?
Comments
Post a Comment