కోపాన్ని అదుపులో ఉంచుకునేందుకు బుద్దుడు చెప్పిన మాటలు
1. నీవు కోసంతో ఉండటమంటే ఇతరులు చేసే తప్పులు నిన్ను దహించటమని అర్ధం
2. నీవు కోపగించుకోవటమంటే నిప్పు కణిక చేతిలో పట్టుతాని ఇతరుల మీదకు వేయాలనుకోవడం వంటిది. అది నిన్నే కాలుస్తుంది.
3. ప్రశాంతత కోసం బయట వెదకరాదు. అది నీలోపల మంచే వస్తుంది.
4. నీలో కోపం వుంటే బయట శత్రువు పొంచి వుంటారు.
5. నీ కోపాన్ని చూసి ఎవరూ నీకు దండన విధించరు. నీ కోసమే నీకు దండన విధిస్తుంది.
6. వేలాది మందిని యుద్ధంలో జయించటంకన్నా తన్ను తాను గెలుచుకోవడం ఎంతో గొప్పది.
7. ద్వేషాన్ని ద్వేషంతో అంతం చేయలేము. అది ప్రేమతోనే సాధ్యం. ఇదొక సార్వజనీన సత్యం.
8. నీలో కోపాన్ని రగించటం సాధ్యం కానప్పుడు నీ చుట్టూ శత్రువులు ఎవరూ ఉండరు.
9. మనసులో వ్యతిరేక భావాలు వున్నంత సేపూ నీ కోపం ఎట్టి పరిస్థితుల్లోనూ మాయం కాదు. అదే వ్యతిరేక భావాల్ని మరచిపోతే నీలోని పోపం మటుమాయమవుతుంది.
10. నీ పట్ల నీవు మంచిగా వున్నావంటే ఇతరులను నువ్వు క్షమిస్తున్నట్లే,
11. ఇతరులను జయించటం కన్నా నిన్ను నీవు జయించుకోవడం ఉత్తమోత్తమం, అదే నీ అంతిమ విజయం.
12. నీ మనస్సును విశాలం చేసుకో, నీ జీవితం ఎంతో సుఖవంతమవుతుంది. గ్లాసు నీళ్ళలో చిటికెడు ఉప్పు,
నీళ్ళను ఉప్పగా మార్చేస్తాయి. అదే ఒక సరస్సులో కొద్దిగా ఉప్పు వేసినా సరస్సులోని నీరు రుచి షూరదు.
13. ఇతరులలో నీవు సౌహార్యంగా ఉండాలంటే, మొట్టమొదట నీతో నీవు సాహారంగా వుండాలి.
14. కోపాన్ని కలిగి ఉండటం అంటే విషాన్ని తీసుకోవడం లాంటిది. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు.
ఎదుటివారిని కూడా బలితీసుకుంటుంది.
15. నిన్ను నువ్వు ప్రేమిస్తూ వుంటే ఇతరులను నీవు గాయపరచలేవు,
16. నీ కోపం వలన నిన్ను ఎవరూ శిక్షించరు. నీ కోపమే నిన్ను శిక్షిస్తుంది.
కోపమునను ఘనత కొంచమై పోవును
కోపమును మిగుల గోడు గలుగు
గోపమదరనేని గోర్కెలు నీడేరు
విశ్వదాభిరామ వినురవేమ!
తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దు:ఖమే నరకమండ్రు తథ్యము సుమతీ!
Comments
Post a Comment