బుద్ధుని ప్రవచనాలు
1. ఎవరైతే తానొక పనిని చేయగలనని బలంగా నమ్ముతాడో, అతడు ఆ పనిని పూర్తి చేయగలడు.
2. గమ్యం చేరడానికి మార్గం ఆకారంలో లేదు. హృదయంలో మార్గం వుంది.
3. జీవిత లక్ష్యం ఏమిటంటే నీ కర్తవ్యాన్ని గుర్తించడమే. తరువాత నీ హృదయాన్ని ఆ కర్తవ్యానికి అంకితం చేయడమే.
4. నిన్ను ఎవరూ రక్షించలేరు. ఎవరూ ఏమి చేయలేదు. చేయబోరు, నీకు నువ్వే సరైన జీవన మార్గాన్ని ఎన్నుకోవాలి.
(ఎవరోవస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా ! నిజం మరచి నిదురపోకుమా ! )
5. చాలా మందికి మార్గాలు తెలుసు, కొంత మంది మాత్రమే తనమార్గంలో ప్రయాణించగలరు.
6, తాను తన మార్గాన్ని కనుగొన్నవాడు. ఇతరులకు మార్గాన్ని సూచించగలడు,
7. సత్యాన్వేషణ కోసం జరిగే ప్రయాణంలో రెండు తప్పులు జరిగే అవకాశముంది. ఒకటి ప్రయాణం చివరి వరకు
సాగించకపోవటం, రెండవది అసలు ప్రారంభించకపోవటం.
8. గమ్యం చేరడానికి మార్గం కాదు, మనస్సుండాలి.
9. తనకు ఇష్టమన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు. బుద్ధిమంతుడు మాత్రం తను చేసే ప్రతి పనిని ఇష్టంగా
మార్చుకుంటాడు.
10. నీవు నీ దిశను మార్చుకోకపోతే నీవు నీ గమ్యాన్ని చేరగలవు,
పట్టుపట్టరాదు పట్టి విడువరాదు.
పట్టినేని బిగయబట్టవలెను పట్టి
విడుచుటకన్న పడివచ్చుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ
- సేకరణ: పిళ్ళా కుమారస్వామి,
సెల్: 9490122229
Comments
Post a Comment